తండ్రైన హార్దిక్ పాండ్యా..
భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రయ్యాడు. అతడి ప్రేయసి నటాషా పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది
Hardik Pandya Blessed With A Baby Boy: భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రయ్యాడు. అతడి ప్రేయసి నటాషా పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హార్దిక్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. చిన్నారి చేతిని అతడు పట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనితో పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు హార్దిక్‌కు కంగ్రాట్స్ తెలిపారు.
ఇక అభిమానులు ఆనందానికి అయితే అవధులు లేకుండాపోయింది. జూనియర్ పాండ్యా వచ్చాడంటూ కామెంట్స్ పెట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా, హార్దిక్ పాండ్యా, నటాషా నిశ్చితార్ధం ఈ ఏడాది జనవరి 1న దుబాయ్‌లో జరిగిన విషయం విదితమే. ఆ తర్వాత మే 31న తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నట్లు హార్దిక్ అభిమానులతో పంచుకున్నాడు.
https://www.instagram.com/p/CDQx8yCF-SX/?utm_source=ig_web_copy_link