క్రికెట్‌లో రేగిన దుమారం : కత్తులు, గొడ్డళ్లతో

సరదాగా ఆడుకునే క్రికెట్..రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.‌ ఆట పెట్టిన చిచ్చుతో ఇరు వర్గాల యువకులు పరస్పరం కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు.

క్రికెట్‌లో రేగిన దుమారం : కత్తులు, గొడ్డళ్లతో
Follow us

|

Updated on: Sep 19, 2020 | 4:19 PM

సరదాగా ఆడుకునే క్రికెట్..రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.‌ ఆట పెట్టిన చిచ్చుతో ఇరు వర్గాల యువకులు పరస్పరం కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం దిన్నెవడ్డిపల్లెకు చెందిన కొందరు యువకులు గురువారం క్రికెట్ మ్యాచ్‌ ఆడారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన నాగసిద్ధులు (45) కుమారుడు నాగార్జున, నాగసుబ్బయ్య (34) బావమరిది నరేష్‌ మధ్య  వివాదం చెలరేగింది. ఈ గొడవ చిలికి, చిలికి గాలివానగా మారింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నాగసిద్ధులు, ఆయన కుమారులు వెంకటష్, నాగార్జున వర్గం… నాగసుబ్బయ్య, అతని తమ్ముడు నాగేంద్ర (32)‌ వర్గం పరస్పరం కర్రలు, కత్తులతో దాడులకు పాల్పడ్డారు.

ఈ కొట్లాటలో నాగసిద్ధులు కడుపు, చేతిపై కత్తిపోట్లు పడి తీవ్ర  గాయాలయ్యాయి. అలాగే నాగసుబ్బయ్య తలకు బలమైన గాయమైంది.  నాగేంద్ర, చంద్ర అనే వ్యక్తులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ నలుగురినీ 108లో పీలేరు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also  Read : ఏపీలో కల్తీ కూల్ డ్రింక్‌లు.. తస్మాత్ జాగ్రత్త !