ఔరంగాబాద్ లో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

| Edited By:

May 05, 2020 | 5:11 PM

Coronavirus In Aurangabad: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించింది. అయినప్పటికీ మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ […]

ఔరంగాబాద్ లో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..
Follow us on

Coronavirus In Aurangabad: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించింది. అయినప్పటికీ మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

కాగా.. మహారాష్ట్రలోని మరాఠవాడ ప్రాంతంలోని ఔరంగాబాద్ లో మంగళవారం ఒక్కరోజులోనే 20 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇలా కోవిద్-19తో మరో వ్యక్తి మృతి చెందారు. కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో, పుణె, అకోలా, అమరావతితో సహా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

Also Read: ఆ 4 జిల్లాల్లో లాక్‌డౌన్ మరింత కఠినం..