పాక్‌ వైమానికదళంలో తొలి హిందూ పైలట్!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిందూ వ్యక్తి ఆ దేశ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్‌గా నియామకం పొందాడు. సింధ్ ప్రావిన్స్‌కు

పాక్‌ వైమానికదళంలో తొలి హిందూ పైలట్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 05, 2020 | 5:42 PM

First Hindu Pilot: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిందూ వ్యక్తి ఆ దేశ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్‌గా నియామకం పొందాడు. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన రాహుల్‌ దేవ్‌ అనే యువకుడు ఈ ఘనత సాధించాడు. పాక్ వైమానిక దళంలో జనరల్‌ డ్యూటీ పైలట్‌గా హిందూ మతానికి చెందిన రాహుల్ దేవ్ నియమితులైనట్లు ఆ దేశ పత్రికల్లో పతాక శీర్షికలతో ప్రచురించారు. అంతర్జాతీయ మీడియా కూడా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రచురించింది.

వివరాల్లోకెళితే.. పాకిస్థాన్‌లో హిందువులు అత్యధికంగా నివసించే సింధ్‌ ప్రావిన్స్‌లోని అతిపెద్ద జిల్లా థార్పార్కర్‌లోని ఓ కుగ్రామంలో పుట్టిన రాహుల్ దేవ్.. ఉన్నత విద్య అభ్యసించి ఈ స్థాయికి చేరుకున్నట్లు పత్రికా కథనాల్లో పేర్కొన్నారు. పాక్‌ వైమానిక దళంలో రాహుల్‌ దేవ్‌ నియామకంపై ఆల్‌ పాకిస్థాన్‌ హిందూ పంచాయత్‌ సెక్రటరీ రవి దవానీ సంతోషం వ్యక్తం చేశారు.

మరోవైపు.. దేశంలో మైనారిటీ వర్గానికి చెందిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులుగా, సైనిక దళంతో పాటు ఇంకా వివిధ రంగాల్లో సేవలను అందిస్తున్నారని దవానీ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో హిందూ మతానికి చెందిన చాలా మంది వైద్యులుగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం మైనారిటీ వర్గాలపై దృష్టి పెడితే, భవిష్యత్తులో అనేక మంది రాహుల్‌ దేవ్‌లు దేశసేవకు సిద్ధమౌతారని ఆయన అన్నారు.

ఏపీకి దూసుకొస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌.! ఏడో ప్రమాద హెచ్చరిక.
ఏపీకి దూసుకొస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌.! ఏడో ప్రమాద హెచ్చరిక.
నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.?
నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.?
జీఎస్టీ వసూళ్లలో రికార్డ్.! రూ.1.66 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు..
జీఎస్టీ వసూళ్లలో రికార్డ్.! రూ.1.66 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు..
ఖాన్‌ యూనిస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు 24గంటల్లో 700మంది మృతి.
ఖాన్‌ యూనిస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు 24గంటల్లో 700మంది మృతి.
తెలంగాణలో మిచౌంగ్ తుపాన్ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాలు..
తెలంగాణలో మిచౌంగ్ తుపాన్ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాలు..
21 వేల కి.మీ పాదయాత్ర.!ఎందుకోసమో తెలుసా.? వీడియో వైరల్.
21 వేల కి.మీ పాదయాత్ర.!ఎందుకోసమో తెలుసా.? వీడియో వైరల్.
మిగ్‌ జాం తుపాను తో చెన్నై అతలాకుతలం!
మిగ్‌ జాం తుపాను తో చెన్నై అతలాకుతలం!
దక్షిణకోస్తాకు ముప్పు! తీరం దాటే సమయంలో సముద్రంలో ఎగసిపడనున్నఅలలు
దక్షిణకోస్తాకు ముప్పు! తీరం దాటే సమయంలో సముద్రంలో ఎగసిపడనున్నఅలలు
చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. బల్లి బిర్యానీ వచ్చింది! వీడియో
చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. బల్లి బిర్యానీ వచ్చింది! వీడియో
మరో యోగి రెడీ అవుతున్నారా.? రాజస్థాన్‌ లో బాబాబాలక్‌నాథ్‌.
మరో యోగి రెడీ అవుతున్నారా.? రాజస్థాన్‌ లో బాబాబాలక్‌నాథ్‌.