AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: వైరస్ సోకిందని కోవిడ్ సెంటర్‌లో ఉంచితే.. వారంతా పారిపోయారు.. త్రిపురలో కలకలం

Covid-19 patients: దేశంలో ఓవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అంతటా ఆందోళన నెలకొంది. అయితే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంతమంది కరోనా సోకినప్పటికీ.. వారు నిబంధనలు

Covid-19: వైరస్ సోకిందని కోవిడ్ సెంటర్‌లో ఉంచితే.. వారంతా పారిపోయారు.. త్రిపురలో కలకలం
Covid-19
Shaik Madar Saheb
|

Updated on: May 13, 2021 | 11:56 AM

Share

Covid-19 patients: దేశంలో ఓవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అంతటా ఆందోళన నెలకొంది. అయితే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంతమంది కరోనా సోకినప్పటికీ.. వారు నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ఇప్పుడు పెను ప్రమాదంగా మారుతోంది. త్రిపుర రాష్ట్రంలోని అంబస్సాలో కోవిడ్ కేర్ సెంటర్ నుంచి 25 మంది బాధితులు తప్పించుకొని పారిపోయారు. బుధవారం జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయం తెలుసుకున్న వైద్యాధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పారిపోయిన కోవిడ్ రోగుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పారిపోయిన వారిలో ఏడుగురిని రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు. మరో 18 మంది కరోనా రోగులు రైలు, లేదా ఇతర వాహనాల్లో త్రిపుర రాష్ట్రం విడిచి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా.. త్రిపుర అంబస్సా పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ భవనంలో తాత్కాలికంగా కోవిడ్ కేర్ సెంటరును ఏర్పాటు చేసి అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను, కరోనా సోకిన వారిని ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ కేర్ సెంటర్ నుంచి 25 మంది కరోనా రోగులు పారిపోవడంతో అన్ని పోలీసుస్టేషన్లు, రైల్వేస్టేషన్లకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేశారు. ఇదిలాఉంటే.. ఏప్రిల్ నెల 22వ తేదీన, 30 వ తేదీన అగర్తలాలోని అరుంధతీనగర్ కరోనా కేర్ సెంటర్ నుంచి కూడా కరోనా రోగులు తప్పించుకొని పారిపోయారు. త్రిపుర స్టేట్ రైఫిల్స్ లో నియమకాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కరోనా బారిన పడటంతో వారిని ఇక్కడ నిర్భంధంలో ఉంచారు. పారిపోయిన వారిని ఇంకా గుర్తించలేదు. దీంతో తమ రాష్ట్రానికి వచ్చే వారందరూ కోవిడ్ నెగిటివ్ రిపోర్టును తప్పనిసరిగా చూపించాలని త్రిపుర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.

Also Read:

ఆగస్టు కల్లా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుతాం, సీరం, భారత్ బయో టెక్ కంపెనీల ప్రకటన, కేంద్రానికి ప్లాన్ సమర్పణ

Ramadan 2021: రేపే రంజాన్.. నేటితో ముగియనున్న ఉపవాసాలు..నేడు సౌదీలో పర్వదినం..