చిత్తూరులో భారీ పేలుడు.. ఓ వ్యక్తి మృతి
చిత్తూరు జిల్లా చెర్లోపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని అక్రమంగా నిల్వ వుంచిన నల్లమందు పేలింది. ఈ ప్రమాదంలో సుధాకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. ఇంటిపై కప్పు పై ఉన్న ప్రహరీ గోడలు దెబ్బతిని చుట్టుపక్కల ఇళ్లపై పడ్డాయి. పేలుడు ధాటికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుధాకర్ నాటువైద్యానికి సంబంధించిన మందులను విక్రయిస్తుంటాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయినప్పటికీ పేలుడుకి గల కారణాలు తెలియలేదు. […]
చిత్తూరు జిల్లా చెర్లోపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని అక్రమంగా నిల్వ వుంచిన నల్లమందు పేలింది. ఈ ప్రమాదంలో సుధాకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. ఇంటిపై కప్పు పై ఉన్న ప్రహరీ గోడలు దెబ్బతిని చుట్టుపక్కల ఇళ్లపై పడ్డాయి. పేలుడు ధాటికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుధాకర్ నాటువైద్యానికి సంబంధించిన మందులను విక్రయిస్తుంటాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయినప్పటికీ పేలుడుకి గల కారణాలు తెలియలేదు. నల్లమందు పేలి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.