Coronavirus Positive Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే అదే సమయంలో రికవరీ కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8012 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,829కు చేరింది. ఇందులో 85,945 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,01,234 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 88 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2650కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 10,117 మంది కరోనాను జయించారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 580, చిత్తూరులో 981, తూర్పు గోదావరిలో 875, గుంటూరులో 590, కడపలో 286, కృష్ణాలో 263, కర్నూలులో 834, నెల్లూరులో 423, ప్రకాశంలో 614, శ్రీకాకుళంలో 773, విశాఖలో 512, విజయనగరంలో 388, పశ్చిమ గోదావరిలో 893 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా 36,391 మంది కరోనాను జయించి ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
#COVIDUpdates: 16/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2,86,934 పాజిటివ్ కేసు లకు గాను
*1,98,339 మంది డిశ్చార్జ్ కాగా
*2,650 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85,945#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/eLzd2iRlbU— ArogyaAndhra (@ArogyaAndhra) August 16, 2020
Also Read:
‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!
అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోని..
వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..
భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..