ఏపీ: కోలుకున్నవారు 1,91,117… యాక్టివ్ కేసులు 88,138

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. టెస్టులు చేసే కొద్దీ రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 8,732 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీ: కోలుకున్నవారు 1,91,117... యాక్టివ్ కేసులు 88,138
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 15, 2020 | 6:16 PM

Coronavirus Positive Cases In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. టెస్టులు చేసే కొద్దీ రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే అదే సమయంలో రికవరీ రేటు కూడా పెరుగుతుండటం ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది. ఇక కొత్తగా 8,732 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 2,81,817కి చేరింది. ఇందులో 88,138 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,91,117 రికవరీ కేసులు ఉన్నాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2562 మరణాలు సంభవించాయి.

గడిచిన 24 గంటల్లో 10,414 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 87 మంది మరణించారు. ఇక నేటి వరకు రాష్ట్రంలో 28,12,197 కరోనా టెస్టులు నిర్వహించారు.

జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి..

1. అనంతపురం – 851 2. చిత్తూరు – 959 3. తూర్పుగోదావరి – 1126 4. గుంటూరు – 609 5. కడప – 389 6. కృష్ణా – 298 7. కర్నూలు – 734 8. నెల్లూరు – 572 9. ప్రకాశం – 489 10. శ్రీకాకుళం – 638 11. విశాఖపట్నం – 894 12. విజయనగరం – 561 13. పశ్చిమ గోదావరి – 612

Also Read:

దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?