ఎఫ్‌-16 విమానాలను కొనేందుకు రెడీ అయిన తైవాన్‌

తైవాన్‌ కూడా తన ఆయుధ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు రెడీ అయ్యింది. ముఖ్యంగా వాయుసేనను మరింత పటిష్టంగా చేసుకునేందుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఎఫ్‌-16 యుద్ధ విమానాలను..

ఎఫ్‌-16 విమానాలను కొనేందుకు రెడీ అయిన తైవాన్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 15, 2020 | 5:57 PM

తైవాన్‌ కూడా తన ఆయుధ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు రెడీ అయ్యింది. ముఖ్యంగా వాయుసేనను మరింత పటిష్టంగా చేసుకునేందుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఎఫ్‌-16 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు యూఎస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాషింగ్టన్ -బీజింగ్‌ల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ఎఫ్ -16 ఫైటర్‌ విమానాలను తైవాన్‌కు విక్రయించేందుకు అగ్రిమెంట్‌ కుదుర్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ యుద్ధ విమానాలను అమెరికాకు చెందిన రక్షణ, ఏరోస్పేస్, టెక్నాలజీ సంస్థ లాఖీడ్ మార్టిన్ కార్ప్ తయారు చేసింది. 2019వ సంవత్సరంలోనే ఈ ఫైటర్‌ జెట్ల కొనగోలుకు ఇరుదేశాల మధ్య అగ్రిమెంట్ కుదరగా.. 2026 చివరి నాటికి అమెరికా 90 ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లను తైవాన్‌కు విక్రయించనుంది. అయితే 1992 నుంచే తైవాన్‌కు ఫైటర్‌ జెట్స్‌ను విక్రయించాలని అమెరికా భావిస్తున్నప్పటికీ.. చైనా నుంచి వ్యతిరేకత ఏర్పడటంతో సైలంట్‌ అయ్యింది. తమ సొంత భూభాగంగా భావించే తైవాన్‌ను ఆయుధాలను విక్రయించొద్దంటూ అమెరికాను డ్రాగన్‌ హెచ్చరిస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికా చైనా వార్నింగ్స్‌ను లెక్కచేయకుండా.. ఎఫ్‌16 ఫైటర్‌ జెట్లను విక్రయించేందుకు రెడీ అయ్యింది.

Read More :

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా

అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు

ఏనుగు దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ మృతి