దేశంలో కరోనా.. 24 గంటల్లో 26,506 కేసులు..

|

Jul 10, 2020 | 11:26 AM

తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 26,506 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 475 మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా.. 24 గంటల్లో 26,506 కేసులు..
Follow us on

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 26,506 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 475 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,802కి చేరుకుంది. ఇందులో 2,76,685 యాక్టివ్ కేసులు ఉండగా.. 21,604 మంది కరోనాతో మరణించారు. అటు 4,95,513 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుతో సహా 8 రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ లిస్టులో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో 2,30,599 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9667 మంది కరోనాతో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 1,07,051 కేసులు, 3258 మరణాలు సంభవించాయి. ఇక తమిళనాడులో అయితే.. 1,26,581 కేసులు నమోదు కాగా, 1765 మంది మృత్యువాతపడ్డారు. కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడులలో సంభవించాయి.

Also Read:

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

వారంతా కంపార్ట్‌మెంటల్‌లో పాస్.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం..

ఆ 8 రాష్ట్రాల్లో కరోనా స్వైరవిహారం.. లిస్టులో ఏపీ, తెలంగాణ..!