ఇక ప్రతి నియోజకవర్గానికి.. కరోనా టెస్టింగ్ మొబైల్ లేబొరేటరీ..!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గానికి ఒక కరోనా టెస్టింగ్ మొబైల్ లేబొరేటరీని అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గానికి ఒక కరోనా టెస్టింగ్ మొబైల్ లేబొరేటరీని అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా ప్రతీ గ్రామానికి వెళ్లి అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి కరోనా నిర్ధారణ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ముఖ్యమంత్రి నుంచి అనుమతి వచ్చాక ప్రజల ముంగిటకే వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో ‘వెర’ స్మార్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ మానిటరింగ్ అనాలసిస్ సర్వీస్ క్వారంటైన్ (ఐ–మాస్క్) టెక్నాలజీతో చేసిన వోల్వో బస్సుల్లో కరోనా లేబొరేటరీ కల్పించినట్లే, ప్రతీ నియోజకవర్గంలో సమకూర్చుతారు. ప్రతి బస్సులో ఒకేసారి పది మందికి కరోనా పరీక్షలు చేసే వీలుంది. అలా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో నడుపుతున్న 3 మొబైల్ బస్సుల్లో రోజూ ఒక్కో దాంట్లో 300 పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే వంద బస్సులు వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో 30 వేల టెస్టులు వీటి ద్వారానే నిర్వహించవచ్చునని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
Also Read: జగన్ కీలక నిర్ణయం.. బీటెక్ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్, ఆనర్స్ డిగ్రీ..!