AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ లో 48.19 శాతానికి చేరిన క‌రోనా రిక‌వ‌రీ రేట్

దేశంలో క‌రోనా పేషెంట్ల రి‌కవ‌‌రీ రేటు క్ర‌మంగా పెరుగుతోంది. సోమ‌వారం వరకు క‌రోనా రిక‌వ‌రీ రేటు 48.19 శాతానికి చేరింది. మే 18 నాటికి 3.15 శాతానికి చేరిన మ‌ర‌ణాల రేటు.

భారత్ లో 48.19 శాతానికి చేరిన క‌రోనా రిక‌వ‌రీ రేట్
Balaraju Goud
|

Updated on: Jun 01, 2020 | 6:26 PM

Share

దేశంలో క‌రోనా పేషెంట్ల రి‌కవ‌‌రీ రేటు క్ర‌మంగా పెరుగుతోంది. సోమ‌వారం వరకు క‌రోనా రిక‌వ‌రీ రేటు 48.19 శాతానికి చేరింది. వైర‌స్ బారిన‌ప‌డినా.. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండ‌గా, మ‌ర‌ణాల రేటు క్రమంగా త‌గ్గుతూ వ‌స్తోంది. దేశంలో ప్ర‌స్తుతం మ‌ర‌ణాల రేటు 2.83 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై సోమ‌వారం వివ‌రాల‌ను వెల్ల‌డ‌లించింది. గ‌డిచిన 24 గంటల్లో 4,835 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం ల‌క్షా 82 వేల మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. అందులో 91,818 మంది కోలుకున్నార‌ని చెప్పింది. పేషెంట్ల రిక‌వ‌రీ రేటు ఏప్రిల్ 15 నాటికి 11.42 శాతం ఉండ‌గా.. అది మే 3వరకు 26.59 శాతానికి, మే 18 నాటికి 38.29 శాతానికి చేరిందని తెలిపింది. గ‌డిచిన రెండు వారాల్లో మ‌రో 10 శాతం పెరిగి.. నేటికి 48.19 శాతానికి క‌రోనా రిక‌వ‌రీ రేటు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్ర‌స్తుతం 93,322 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. ఏప్రిల్ 15నాటికి మొత్తం కేసుల్లో 3.3 శాతం పేషెంట్లు క‌రోనాకు బ‌ల‌య్యారు. మే 3నాటికి 3.25 శాతం క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. మే 18 నాటికి 3.15 శాతానికి చేరిన మ‌ర‌ణాల రేటు.. ఇవాళ 2.83 శాతానికి త‌గ్గింది. కరోనా పరీక్షల సంఖ్య పెంచి స‌రైన స‌మ‌యంలో క‌రోనా పేషెంట్ల‌ను గుర్తించ‌డం ద్వారా మ‌ర‌ణాల‌ను వీలైనంత‌గా త‌గ్గించొచ్చ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొద్ది రోజులుగా టెస్టింగ్ కెపాసిటీ బాగా పెరిగింద‌ని, 472 ప్ర‌భుత్వ‌, 204 ప్రైవేటు ల్యాబ్స్ ద్వారా నిన్న ఒక్క రోజే 1,00,180 శాంపిల్స్ ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది.

Follow Us
అతను నా క్లాస్ మేట్.. ఆ హ్యాండ్సమ్ హీరోపై శ్రుతి హాసన్ కామెంట్స్
అతను నా క్లాస్ మేట్.. ఆ హ్యాండ్సమ్ హీరోపై శ్రుతి హాసన్ కామెంట్స్
ఆ అమ్మాయి నా కూతురితో సమానం.. ధురంధర్ 2 నటుడు..
ఆ అమ్మాయి నా కూతురితో సమానం.. ధురంధర్ 2 నటుడు..
కావ్యపాప డార్క్ హార్స్ భయ్యో.. లైట్ తీసుకుంటే తాట తీస్తారంతే..!
కావ్యపాప డార్క్ హార్స్ భయ్యో.. లైట్ తీసుకుంటే తాట తీస్తారంతే..!
ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ యాప్స్‌లో అంతా మోసం?
ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ యాప్స్‌లో అంతా మోసం?
దారుణం.. అప్పు తీర్చలేదనీ వ్యక్తిపై కల్లు సీసాలతో దాడి! వీడియో
దారుణం.. అప్పు తీర్చలేదనీ వ్యక్తిపై కల్లు సీసాలతో దాడి! వీడియో
డయాబెటిస్ ఉన్నవారికి, కాల్షియం లోపం ఉన్నవారికి ఇది బెస్ట్ టిఫిన్.
డయాబెటిస్ ఉన్నవారికి, కాల్షియం లోపం ఉన్నవారికి ఇది బెస్ట్ టిఫిన్.
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో విస్తుపోయే నిజాలు..హైదరాబాద్‌లో ఒకరు..
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో విస్తుపోయే నిజాలు..హైదరాబాద్‌లో ఒకరు..
'ధురంధర్ 2' పై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. వీడియో
'ధురంధర్ 2' పై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. వీడియో
RCB: చిన్నస్వామిలో ఆ 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే..!
RCB: చిన్నస్వామిలో ఆ 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే..!
బంగారం మార్కెట్‌లో మహాప్రళయం.. 50 ఏళ్ల రికార్డులు బద్ధలు..
బంగారం మార్కెట్‌లో మహాప్రళయం.. 50 ఏళ్ల రికార్డులు బద్ధలు..