పేదల‌కు రేష‌న్ పంపిణీ చేసిన‌ టీచ‌ర్ క‌రోనాతో మృతి..

పేదల‌కు రేష‌న్ పంపిణీ చేసిన‌ టీచ‌ర్ క‌రోనాతో మృతి..

కరోనావైరస్ కారణంగా విధించిన‌ లాక్ డౌన్ సమయంలో రేషన్ పంపిణీ విధుల్లో నియమించబడిన ఒక  ఉపాధ్యాయురాలు కన్నుమూసినట్లు ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌రైన‌ ఆమెను అధికారులు ఇటీవ‌ల‌ డిప్యుటేష‌న్‌పై పేద‌ల‌కు స‌రుకులు పంపిణీ చేసే ప‌నిలో నియ‌మించారు. నార్త్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఏరియాలో ఆమె పేద‌ల‌కు రేష‌న్ అందించారు. ఆమెకు క‌రోనా సోకినట్టు ఈ శ‌నివార‌మే తెలిసింది. ఆమె చివరిసారిగా ఏప్రిల్ 28 న పాఠశాలకు వెళ్లారు. మే 2 నుండి ఆమెకు […]

Ram Naramaneni

|

May 10, 2020 | 9:36 PM

కరోనావైరస్ కారణంగా విధించిన‌ లాక్ డౌన్ సమయంలో రేషన్ పంపిణీ విధుల్లో నియమించబడిన ఒక  ఉపాధ్యాయురాలు కన్నుమూసినట్లు ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌రైన‌ ఆమెను అధికారులు ఇటీవ‌ల‌ డిప్యుటేష‌న్‌పై పేద‌ల‌కు స‌రుకులు పంపిణీ చేసే ప‌నిలో నియ‌మించారు. నార్త్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఏరియాలో ఆమె పేద‌ల‌కు రేష‌న్ అందించారు. ఆమెకు క‌రోనా సోకినట్టు ఈ శ‌నివార‌మే తెలిసింది. ఆమె చివరిసారిగా ఏప్రిల్ 28 న పాఠశాలకు వెళ్లారు. మే 2 నుండి ఆమెకు కోవిడ్-19 లక్షణాలను చూపించడం ప్రారంభించాయి. దీంతో ఆమె నుంచి న‌మూనాల‌ను సేక‌రించి ల్యాబ్ కు పంపించారు. శుక్రవారం వ‌చ్చిన ఫ‌లితాల్లో టీచ‌ర్ కు కోవిడ్-19 వచ్చిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింద‌ని ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. కాగా ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు 6, 923 మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారని.. వారిలో 74 మంది మ‌ర‌ణించారని తెలిపారు అధికారులు. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 4,781గా ఉంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu