పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో ఆర్థిక సాయం కోసం ఉద్ధేశించిన ప్రధాని మంత్రి సహాయ నిధికి విరాళాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు పెద్ద ఎత్తున పీఎం కేర్స్‌కి..

పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 4:59 PM

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో ఆర్థిక సాయం కోసం ఉద్ధేశించిన ప్రధాని మంత్రి సహాయ నిధికి విరాళాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు పెద్ద ఎత్తున పీఎం కేర్స్‌కి విరాళాలు అందించారు. తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన వార్షిక వేతనంలో 30 శాతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా రాష్ట్రపతి ఇప్పటికే ఒక సారి పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందజేశారు. మార్చి నెలకు సంబంధించిన తన పూర్తి వేతనాన్ని ప్రధాని మంత్రి సహాయ నిధికి అందించారు. తాజాగా తన వార్షిక వేతనంలో సైతం 30 శాతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే జీతాల్లో 30 శాతం కోతని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయానికి అనుగుణంగా.. ఇప్పుడు రాష్ట్ర పతి నిర్ణయం తీసుకున్నారు.

కాగా నెల వేతనాన్ని విరాళం ప్రకటించినందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు.

Read More:

లాక్‌డౌన్‌లో సైలెంట్‌గా.. ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్

గుడ్‌న్యూస్: అక్కడ విద్యార్థులకు టెన్త్ పరీక్షలు లేవు.. డైరెక్ట్ పాస్!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్