హైదరాబాద్ : క్యాబ్ డ్రైవర్‌కు కరోనా లక్షణాలు..భయాందోళనలో ప్రయాణీకులు

|

Mar 20, 2020 | 3:26 PM

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ ప్రభావం క్యాబ్‌లపై పడింది. శంషాబాద్‌ దగ్గర క్యాబ్‌ డ్రైవర్లలో ఒకరికి కరోనా సోకినట్టు అనుమానాలొచ్చాయి.. అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. దీంతో క్యాబ్‌లో ప్రయాణించేందుకు జనం భయపడుతున్నారు. ప్యాసింజర్స్‌ లేకపోవడంతో రెండు రోజులుగా ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. దీనికి తోడు విదేశాల నుంచి వచ్చే వారితో తమకు కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని క్యాబ్‌ డ్రైవర్లు భయపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చే […]

హైదరాబాద్ : క్యాబ్ డ్రైవర్‌కు కరోనా లక్షణాలు..భయాందోళనలో ప్రయాణీకులు
Follow us on

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ ప్రభావం క్యాబ్‌లపై పడింది. శంషాబాద్‌ దగ్గర క్యాబ్‌ డ్రైవర్లలో ఒకరికి కరోనా సోకినట్టు అనుమానాలొచ్చాయి.. అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. దీంతో క్యాబ్‌లో ప్రయాణించేందుకు జనం భయపడుతున్నారు. ప్యాసింజర్స్‌ లేకపోవడంతో రెండు రోజులుగా ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. దీనికి తోడు విదేశాల నుంచి వచ్చే వారితో తమకు కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని క్యాబ్‌ డ్రైవర్లు భయపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులంటేనే భయపడిపోతున్నారు. పోనీ ఇంట్లో ఉందామా అంటే పూట గడవడం కష్టమవుతుందనే బెంగ వారిలో ఉంది.. పైగా ఈఎమ్‌ఐలు ఒకటి! కట్టకపోతే బ్యాంకులు ఊరుకోవు.. ధైర్యం చేసి కారు నడిపిద్దామంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి…మొత్తంమీద క్యాబ్‌ డ్రైవర్లు ఇప్పుడు భయాందోళనల మధ్య రోడ్డెక్కుతున్నారు.