ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం.. ఒక్క రోజులో 6,05,058 పాజిటివ్ కేసులు, 13,218 మరణాలు.!

|

Dec 23, 2020 | 6:17 PM

Coronavirus Cases World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలు కావడంతో..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం.. ఒక్క రోజులో 6,05,058 పాజిటివ్ కేసులు, 13,218 మరణాలు.!
Follow us on

Coronavirus Cases World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూపోతోంది. నిన్న ఒక్క రోజు 6,05,058 పాజిటివ్ కేసులు, 13,218 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78,481,651కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,726,611 మంది కరోనాతో మరణించారు. ఇక 55,245,705 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (Coronavirus Active Cases In World)

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 18,684,628కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 330,824 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో కొత్తరకం ‘స్ట్రెయిన్’ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇండియాలో ఇప్పటివరకు 10,099,308 పాజిటివ్ కేసుల కేసులు నమోదు కాగా.. 146,476 మంది వైరస్ కారణంగా మరణించారు. (Coronavirus Cases In World Wide)

Also Read:

‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!

ఆన్‌లైన్‌ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!