Coronavirus: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఏప్రిల్ నెల రేషన్ బియ్యాన్ని ఈ నెల 29న అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. బియ్యంతో పాటు కేజీ కందిపప్పును కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
అటు నిత్యావసర సరుకులకు రూ.1000 ఆర్ధిక సాయాన్ని అందిస్తుండగా.. దీనికి రూ. 1330 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు పూర్తి శాలరీ చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా కాని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, కూరగాయలు, గృహ అవసరాలు, పాలు, గుడ్లు, మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఆక్వా, పశుగ్రాసం సరఫరా రవాణాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోమని అధికారులకు నీలం సాహ్ని స్పష్టం చేశారు.
For More News:
ఫ్లాష్: భారత్‌లో ఎనిమిదో కరోనా డెత్.. 425కు చేరుకున్న పాజిటివ్ కేసులు..
ఏపీ ప్రభుత్వం సంచలనం.. పేదల ఇళ్ల కోసం స్విస్ టెక్నాలజీ..
షాకింగ్: కరోనా వైరస్‌తో హీరోయిన్ తండ్రి మృతి…
కరోనా కట్టడికి మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం…
రోహిత్‌కు కోపమొచ్చింది.. ఐసీసీ క్షమాపణ చెప్పింది..
కోరలు చాస్తున్న కరోనా.. భారత్‌లో 9కి చేరిన మృతుల సంఖ్య..
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో బ్యాంక్ వేళల్లో మార్పులు…