కరోనా ఎఫెక్ట్: వీఐపీలకు వింత కష్టాలు!
కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారత్ కూ తిప్పలు తప్పడంలేదు. ఈ క్రమంలో హర్యానాలోని పలువురు వీఐపీలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ‘‘సారూ’’ అంటూ వెంట తిరిగిన వాళ్లే

కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారత్ కూ తిప్పలు తప్పడంలేదు. ఈ క్రమంలో హర్యానాలోని పలువురు వీఐపీలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ‘‘సారూ’’ అంటూ వెంట తిరిగిన వాళ్లే… ఇప్పుడు వింతగా చూడడం మొదలు పెట్టారు. స్థానికుల ప్రవర్తనతో స్వచ్ఛందంగా క్వారంటైన్లో ఉన్న వీఐపీలంతా ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. పిల్లలు, కుటుంబ సభ్యులు విదేశాల నుంచి రావడం వల్ల హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ అధికారులు ఇటీవల కొందరు వీఐపీల ఇళ్లముందు నోటీసులు అంటించారు.
భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. క్వారంటైన్ నోటీసులను స్థానికులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో వీరికి కష్టాలు మొదలయ్యాయి. ఓ న్యాయమూర్తి కుటుంబం మొదలు సీఎం పేషీలో పనిచేసే ఐఏఎస్ అధికారి కుటుంబం దాకా ఇదే పరిస్థితి. చండీగఢ్‌లో ప్రముఖ లాయర్ పునీత్ బాలి కుటుంబానిది కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఇళ్ల ముందు క్వారంటైన్ నోటీసులు కనిపిస్తే అదేదో నిషిద్ధమన్నట్టు స్థానికులు భావిస్తున్నారంటూ వీళ్లంతా లబోదిబోమంటున్నారు.



