ఏపీ ప్రభుత్వం సంచలనం.. పేదల ఇళ్ల కోసం స్విస్ టెక్నాలజీ..

Coronavirus: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు కట్టించే ఇళ్లకు స్విస్ టెక్నాలజీతో పాటుగా ఇంధన సామర్ధ్య టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. దీని వల్ల విద్యుత్ ఆదాతో పాటు కొత్తగా నిర్మించిన ఇళ్లలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 8 డిగ్రీల వరకు తగ్గుతాయని గుర్తించారు. ఇక ఈ ప్రాజెక్ట్ ను వివరించేందుకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) అధికారులు ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌తో […]

ఏపీ ప్రభుత్వం సంచలనం.. పేదల ఇళ్ల కోసం స్విస్ టెక్నాలజీ..
Follow us

|

Updated on: Mar 23, 2020 | 10:08 PM

Coronavirus: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు కట్టించే ఇళ్లకు స్విస్ టెక్నాలజీతో పాటుగా ఇంధన సామర్ధ్య టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. దీని వల్ల విద్యుత్ ఆదాతో పాటు కొత్తగా నిర్మించిన ఇళ్లలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 8 డిగ్రీల వరకు తగ్గుతాయని గుర్తించారు. ఇక ఈ ప్రాజెక్ట్ ను వివరించేందుకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) అధికారులు ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌తో ఇటీవల భేటీ అయ్యారు.

దేశంలో తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ రెసిడెన్షియల్ ప్రకారం.. ఇండో స్విస్‌ ఇంధన సామర్థ్య సాంకేతికతను బలహీనవర్గాల గృహాలకు అందజేస్తామని తెలిపారు. ఇక ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈఓ ఎ. చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో వెల్లడించారు. ఈసీబీసీఆర్‌ విధానాన్ని వినియోగించడం వల్ల గృహ నిర్మాణ వ్యయం కొంతవరకు తగ్గుతుందని బీఈఈ పేర్కొంది. సుమారు 30 లక్షల ఇళ్లలో ఎల్‌ఈడీ లైట్లు, ఇంధన సామర్థ్యం కలిగిన ఫ్యాన్లు, ఇతరత్రా ఎనర్జీ సామర్థ్య ఉపకరణాలను అమర్చేందుకు సహకరించాల్సిందిగా ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోరినట్లు చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఈసీబీసీ రెసిడెన్షియల్ కోసం కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఉంది.

ప్రాజెక్ట్ వివరాలు ఇలా ఉన్నాయి…

14,097 జగనన్న కాలనీల పేరుతో పేదలు, బలహీనవర్గాలకు 30 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గృహ నిర్మాణ పథకం ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. ఈ ఇళ్లలో పెద్ద హాల్, బెడ్‌ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్‌ వంటి సౌకర్యాలు ఉంటాయి. అలాగే ఈ ఇంటికి 16.66 శాతం ఓపెన్ ఏరియా ఉంటుంది. వీటిని ఇండో- స్విస్ టెక్నాలజీతో కట్టడం వల్ల ఇంటిలో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతుంది. అటు పగటిపూట ఇంటిలోకి సహజసిద్ధమైన వెలుతురు పెరగడమే కాకుండా చల్లదనం కూడా ఉంటుంది. కాబట్టి ఏసీలు, కూలర్లు వాడకం తక్కువ ఉంటుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్ కంపెనీలు అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ కు అందిస్తోంది.

For More News:

ఫ్లాష్: భారత్‌లో ఎనిమిదో కరోనా డెత్.. 425కు చేరుకున్న పాజిటివ్ కేసులు..

షాకింగ్: కరోనా వైరస్‌తో హీరోయిన్ తండ్రి మృతి…

కరోనా కట్టడికి మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం…

ఏపీ లాక్ డౌన్: ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలి..

రోహిత్‌కు కోపమొచ్చింది.. ఐసీసీ క్షమాపణ చెప్పింది..

కోరలు చాస్తున్న కరోనా.. భారత్‌లో 9కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో బ్యాంక్ వేళల్లో మార్పులు…

వైరస్ వ్యాప్తి.. ఇంగ్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం..

ఫ్లాష్: భారత్‌లో 10వ కరోనా మరణం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!