ఏపీలో కూడా లాక్‌డౌన్…
మార్చి 31వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ ప్రకటించారు సీఎం జగన్. ఎమర్జెన్సీ మినహా పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం జగన్. ఇప్పటికి ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందులో ఒకరికి వ్యాధి తగ్గిపోగా డిశ్చార్జ్ చేశామని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు యదాతథంగా జరుగుతాయన్న సీఎం, సమస్యలు ఉన్న విద్యార్థలకు ప్రత్యేక రూమ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. […]

మార్చి 31వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ ప్రకటించారు సీఎం జగన్. ఎమర్జెన్సీ మినహా పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం జగన్. ఇప్పటికి ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందులో ఒకరికి వ్యాధి తగ్గిపోగా డిశ్చార్జ్ చేశామని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు యదాతథంగా జరుగుతాయన్న సీఎం, సమస్యలు ఉన్న విద్యార్థలకు ప్రత్యేక రూమ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సీఎం జగన్ చెప్పిన మరిన్ని విషయాలు :
- కరోనా లక్షణాలు ఉంటే 104కు కాల్ చెయ్యండి
- నిత్యావసర దుకాణాలు తప్ప మిగతావన్నీ బంద్
- ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు
- కరోనా నివారణకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు
- దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో మెరుగైన పరిస్థితి ఉంది
- ప్రజలెవరూ గుమిగూడవద్దు
- ఫ్యాక్టరీలు, ప్రైవేట్ ఆఫీసులు కూడా మూసివేయాలి
- కరోనాను ఎదుర్కోడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలి
- నిత్యావసరాలు బ్లాక్ చేస్తే..జైలుకే
- ప్రభుత్వం ప్రకటించిన ధరలను మించి అమ్మితే తీవ్ర చర్యలు
- పెద్ద వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి..
- విదేశాల నుంచి వచ్చిన 11,670 మందికి స్క్రీనింగ్ చేశాం
- రేషన్ ఫ్రీ..ప్రతి కుటుంబానికి సాయంగా రూ. 1000
