ఏపీ : స్కూళ్లలో కరోనా వ్యాప్తి, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

ప్రభుత్వ స్కూళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

ఏపీ : స్కూళ్లలో కరోనా వ్యాప్తి, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
Follow us

|

Updated on: Nov 05, 2020 | 7:38 AM

ప్రభుత్వ స్కూళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకమైన టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం గుర్తించిన కేసులు రెండ్రోజుల క్రితం టెస్ట్‌లు నిర్వహించిన వారికి వచ్చినవిగా మంత్రి తెలిపారు. కరోనా సోకిన విద్యార్థులు, టీచర్లను వెంటనే ఐసోలేట్‌ చేశామన్నారు. మూడు వారాల తర్వాత 9,10 క్లాసుల నిర్వహణపై సమీక్ష చేస్తామన్నారు మంత్రి సురేశ్‌. పెరుగుతున్న కేసుల్ని దృష్టిలో పెట్టుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు పాఠశాలల్ని నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు.

Also Read :  నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !