హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న కరోనా..!

కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముందుగానే అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్యసహాయాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రతీ ప్రయాణికుడికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి కరోనా లేదని తేలితేనే.. నగరంలోకి వెళ్లడానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు. కాగా.. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించిన కారణంగా.. వారికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో ఒక వ్యక్తిలో మాత్రమే […]

హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న కరోనా..!
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2020 | 10:24 AM

కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముందుగానే అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్యసహాయాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రతీ ప్రయాణికుడికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి కరోనా లేదని తేలితేనే.. నగరంలోకి వెళ్లడానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు.

కాగా.. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించిన కారణంగా.. వారికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో ఒక వ్యక్తిలో మాత్రమే జలుబు, దగ్గు, జ్వర లక్షణాలు కనిపించడంతో వైద్యులు అతడి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పూణెకు పంపించారు. పరీక్షల్లో కరోనా వైరస్ లేదని నిర్ధారించే వరకూ కుటుంబసభ్యులు, సన్నిహితంగా ఉండేవారిని ఇళ్లకే పరిమితం చేయాలని ఆదేశాలు జారీచేసింది.

ఈ వైరస్ లక్షణాలు కనిపించడానికి సుమారు రెండువారాలు పట్టే అవకాశాలు ఉన్నాయని, ఆలోగా వ్యాధి లేదని బయట తిరిగితే.. ఇతరులకు వ్యాప్తిచెందే ప్రమాదముందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. రోగుల బ్లడ్‌ను టెస్ట్ చేసిన డాక్టర్లు.. వారిలో ఎవరికీ కరోనా లేదని తేల్చి చెప్పారు. దీంతో.. తెలంగాణ వైద్య శాఖ ఊపిరి పీల్చుకుంది.

కరోనా వైరస్ లక్షణాలు ఇవే:

1. ఈ వ్యాధి సోకిన వారికి జలుబు ఎక్కువగా ఉండి, ముక్కు కారుతూనే ఉంటుంది. 2. గొంతులో మంటగా ఉంటుంది. 3. తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. 4. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది.

పైన తెలిపిన లక్షణాలు ఉంటే… వెంటనే డాక్టర్‌ను కలవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వైరస్‌కి మందు లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఉండొద్దు. ప్రస్తుతం ఫీవర్‌ ఆసుపత్రిలో ఉన్నవారి కుటుంబ సభ్యులను కూడా ఇంటికి పరిమితం చేశారు అధికారులు.

ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా