Badminton : ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కెంటా మొమోటాకు కరోనా… థాయ్‌లాండ్ ఓపెన్‌కు దూరం…
ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్, జపాన్‌కు చెందిన క్రీడాకారుడు కెంటా మొమోటాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది...
ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్, జపాన్‌కు చెందిన క్రీడాకారుడు కెంటా మొమోటాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడు త్వరలో జరుగనున్న థాయ్‌లాండ్ ఓపెన్‌కు దూరం కానున్నాడు. ఈ మేరకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది జనవరిలో మలేషియా మాస్టర్స్ నెగ్గిన గంటల వ్యవధిలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన మొమోటా.. ఏడాది అనంతరం తిరిగి మైదానంలో అడుగు పెట్టాలని భావిస్తున్న వేళ అతడికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.
Also Read:
Indian Badminton Team: బ్యాంకాక్ బయలుదేరిన భారత బ్యాడ్మింటన్ బృందం… జనవరి 12 నుంచి 17 వరకు టోర్నీ….