New virus strain : రాజమండ్రిలో కొత్త రకం కరోనా వైరస్ కలకలం..యూకే నుంచి వచ్చిన మహిళకు వైరస్ పాజిటివ్

బ్రిటన్‌ నుంచి ఈ నెల 21న ఢిల్లీకి వచ్చిన రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో జిల్లా అధికారుల్లో టెన్షన్ నెలకుంది. ఆమెను ఢిల్లీ విమానాశ్రయంలో క్వారంటైన్ లో ఉంచగా

New virus strain  : రాజమండ్రిలో కొత్త రకం కరోనా వైరస్ కలకలం..యూకే నుంచి వచ్చిన మహిళకు వైరస్ పాజిటివ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 24, 2020 | 8:53 AM

New virus strain :  బ్రిటన్‌ నుంచి ఈ నెల 21న ఢిల్లీకి వచ్చిన రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో జిల్లా అధికారుల్లో టెన్షన్ నెలకుంది. ఆమెను ఢిల్లీ విమానాశ్రయంలో క్వారంటైన్ లో ఉంచగా తప్పించుకుని ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో బుధవారం రాత్రి రాజమండ్రికి వచ్చారు. ఈ విషయం తెలియడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సదరు మహిళను, ఆమె కుమారుడిని స్టేషన్‌ నుంచి నేరుగా గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె రక్త నమూనాలను పూణె ల్యాబ్ కు పంపనున్నారు.

బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో.. రాష్ట్రంలోకి ప్రవేశించిన అంతర్జాతీయ విమాన ప్రయాణికుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సేకరిస్తోంది. గడిచిన 2 వారాల్లో ఏపీలోకి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలు తెలపాలని ఇమ్మిగ్రేషన్‌ అధికారులను కోరింది.

Also Read :

రూ. లక్షల డబ్బు ఉన్న సంచి లాక్కుని కోతి పరార్..కన్నీరుమున్నీరయిన వృద్ధుడు. చివరకు ఏం జరిగిందంటే..?

Survey training institute : తిరుపతిలో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటుకు భూమి కేటాయింపు…అర్బన్ మండలంలోని ఆ గ్రామంలో