పెద్ద పులులకు కరోనా సోకకుండా రక్షణ చర్యలు

అమెరికా జూపార్క్ లోని పెద్దపులికి కరోనా సోకడంతో జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అప్రమత్తమైంది. నల్లమల అటవీ ప్రాంతంలోకి కరోనా వైరస్‌ వ్యాపించకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వన్యప్రాణులతో పాటు పులులను కాపాడుకునేందుకు రక్షణ చర్యలు తీసుకుంటుంది.

పెద్ద పులులకు కరోనా సోకకుండా రక్షణ చర్యలు
Follow us

|

Updated on: Jun 24, 2020 | 3:14 PM

కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. అడవిలోని పెద్దపులులనూ సైతం వదలడం లేదు. దీంతో అటవీ అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. అమెరికా జూపార్క్ లోని పెద్దపులికి కరోనా సోకడంతో జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అప్రమత్తమైంది. నల్లమల అటవీ ప్రాంతంలోకి కరోనా వైరస్‌ వ్యాపించకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వన్యప్రాణులతో పాటు పులులను కాపాడుకునేందుకు రక్షణ చర్యలు తీసుకుంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్‌ -శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులుల సంచారం ఎక్కువ. ప్రస్తుతం 40కి పైగా పెద్దపులులు ఉన్నట్లు అధికారు చెబుతున్నారు. ఇప్పటి వరకు బహిరంగ ప్రదేశాలకు మాత్రమే పరిమితమైన కరోనా, పులులకు సోకకుండా రక్షణ చర్యలు చేపడుతున్నారు వన్యప్రాణుల సంరక్షణ అధికారులు. పులుల సంరక్షకులైన టైగర్‌ట్రాకర్స్‌కి మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నారు. వన్యప్రాణులు నీరు తాగే ప్రాంతాలను గుర్తించి శానిటైజేషన్ చేస్తున్నారు. ప్రత్యేక ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్ చల్లి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మైదాన ప్రాంతంలోని వ్యక్తులెవరూ అడవిలోకి వెళ్లకుండా అటవీ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇక ప్రతిరోజు పశువులు, గొర్రెలు, జీవాల మేత కోసం వెళ్లేవారిని అడ్డుకుంటున్నారు. చెంచు గిరిజనులు ఫలసాయాలకు అటవీ లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అటవీ సమీపంలో ఉన్న గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో