బ్యాంక్ ఖాతాదారులకు ఝలక్..జూలై 1 నుంచి కొత్త రూల్స్..!
బ్యాంక్ ఖాతాలు ఉన్నవారంరికీ ఓ ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. జులై నుంచి బ్యాంక్‌కు సంబంధించిన చాలా అంశాల్లో మార్పులు రాబోతున్నాయి. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ దగ్గరి నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వరకు పలు అంశాల్లో మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్యాంక్ ఖాతాలు ఉన్నవారంరికీ ఓ ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. జులై నుంచి బ్యాంక్‌కు సంబంధించిన చాలా అంశాల్లో మార్పులు రాబోతున్నాయి. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ దగ్గరి నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వరకు పలు అంశాల్లో మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లపై డైరెక్ట్ గానే ఎఫెక్ట్ పడనుంది. జూలై 1 నుంచి మారబోతున్న బ్యాంక్ రూల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను 0.5 శాతం తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో వచ్చే నెల నుంచి బ్యాంక్ ఖాతాదారులకు గరిష్టంగా 3.25 శాతం వరకు ఇంట్రస్ట్ లభిస్తుంది.
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఏటీఎం క్యాష్ విత్‌డ్రాపై చార్జీలు తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే జులై నుంచి ఈ సౌలభ్యం అందుబాటులో ఉండకపోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 3 నెలలు వరకు మాత్రమే చార్జీల మినహాయింపు ఉంటుందని తెలిపిన నేపథ్యంలో.. ఇవి మళ్లీ వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక బ్యాంకు కస్టమర్స్ కు వచ్చే నెల నుంచి మరో ఝలక్ కూడా తగలనుంది. నిర్మలా సీతారామన్ గతంలో బ్యాంక్ అకౌంట్లపై మినిమమ్ బ్యాలెన్స్ చార్జస్ కూడా తొలగిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఈ బెనిఫిట్ కూడా 3 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. దీంతో జులై నుంచి మళ్లీ మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో మళ్లీ చార్జీలు బాదుడు స్టార్ట్ అవుతుంది.