లండన్.. కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్ లో ముందడుగు…తొలి వలంటీర్ ఆరోగ్యంపై నిశిత దృష్టి

కరోనా విరుగుడుకి అవసరమైన వ్యాక్సీన్ కి మనం చేరువవుతున్నట్టు కనిపిస్తోంది. లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు ఈ విషయంలో ముందడుగు వేశారు. తాము డెవలప్ చేసిన వ్యాక్సీన్ ని ఆరోగ్య వంతుడైన ఓ వలంటీర్ కి ఇచ్చినట్టు వారు ప్రకటించారు. వెస్ట్ లండన్ లోని ఓ కేంద్రంలో..

లండన్.. కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్ లో ముందడుగు...తొలి వలంటీర్ ఆరోగ్యంపై నిశిత దృష్టి
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2020 | 3:20 PM

కరోనా విరుగుడుకి అవసరమైన వ్యాక్సీన్ కి మనం చేరువవుతున్నట్టు కనిపిస్తోంది. లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు ఈ విషయంలో ముందడుగు వేశారు. తాము డెవలప్ చేసిన వ్యాక్సీన్ ని ఆరోగ్య వంతుడైన ఓ వలంటీర్ కి ఇచ్చినట్టు వారు ప్రకటించారు. వెస్ట్ లండన్ లోని ఓ కేంద్రంలో చాలా స్వల్పంగా ఈ డోసును అతడికి ఇఛ్చామని, అతడి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామని వారు వెల్లడించారు. కరోనా మహమ్మారిని అణచివేయగలదని భావిస్తున్న…. వ్యాక్సీన్ ని అందుకున్న తొలి వలంటీర్ అయ్యాడతను. ప్రస్తుతం అతడు హెల్దీగా ఉన్నాడని, ఎలాంటి ‘కాంప్లికేషన్స్’ కనబడలేదని ఇంపీరియల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్  చీఫ్ ఇన్వెస్టిగేటర్ అయిన డాక్టర్ కత్రినా పొలాక్ తెలిపారు.  హ్యూమన్ ట్రయల్స్ తొలి టెస్టుకు ఉపయోగించిన ఈ వ్యాక్సీన్ ని ‘సెల్ఫ్ యాంప్లిఫయింగ్  RNA  టెక్నాలజీ’ కింద అభివృధ్ది పరచిన వ్యాక్సీన్ గా ఆమె పేర్కొన్నారు. ‘ఈ గ్రౌండ్ బ్రేకింగ్ స్టడీలో మేం తొలి డోసును ఒక వలంటీర్ కి సురక్షితంగా ఇచ్చామని   ఆమె చెప్పారు. మరింతమంది వలంటీర్లకు ఇచ్ఛే ముందు డోస్ ఎవాల్యుయేషన్ ఫేజ్ (అది ఎలా పని చేస్తుందన్న) అంశాన్ని కూడా మదింపు చేస్తామన్నారు.

ఈ వ్యాక్సీన్    తయారీకి బ్రిటన్ ప్రభుత్వం ఈ సంస్థకు 41 మిలియన్ పౌండ్లను, మరో ధార్మిక సంస్థ 5 మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చాయి. ఈ వ్యాక్సీన్ ఇచ్ఛే ముందు కూడా నిర్విరామంగా ప్రీ-క్లినికల్ సేఫ్టీ టెస్టులను రీసెర్చర్లు నిర్వహించారు. జంతువులకు సైతం   ప్రయోగాత్మకంగా ఇఛ్చినట్టు వారు పేర్కొన్నారు. ట్రయల్ ఫలితాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం.. యాంటీ బాడీలను ఈ వ్యాక్సీన్ న్యూట్రలైజ్ చేయగలదా.. రోగ నిరోధక శక్తిని పెంచగలదా అన్న విషయాన్ని పరిశిలీస్తున్నాం.. అని ప్రొఫెసర్ రాబిన్ షటాక్ అనే మరో రీసెర్చర్ చెప్పారు. నాలుగు వారాల్లోగా మరో డోసును ఈ వలంటీర్ కి ఇస్తామన్నారు. ఇలా ఉండగా ‘సార్స్-కోవ్-2’లేదా ‘కొవిడ్-19’ వైరస్ ని ఎదుర్కోగల యాంటీ బాడీలను ఈ వలంటీర్ ప్రొడ్యూస్ చేయగలుతాడా అన్న అంశాన్ని కూడా క్లినికల్ టీమ్ మానిటర్ చేస్తూనే ఉంటుంది. మొదటి దశలో మరో 15 మందికి, ఆ తరువాత సుమారు 300 మందికి ఈ వ్యాక్సీన్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇది చాలా సురక్షితమైనదని తేలితే.. ఈ సంవత్సరాంతంలో మరిన్ని ట్రయల్స్ నిర్వహించనున్నారు. బ్రిటన్ లో 305,289 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 42,647 మంది రోగులు మృతి చెందారు.