కరోనా ఎఫెక్ట్: ఇంట్లోనే మాస్క్‌ని తయారు చేసుకోండిలా

కరోనా వైరస్ భయంతో అందరూ మాస్క్‌లను కొనుగోలు చేస్తున్నారు. పలు సేవా సంస్థలు కూడా ఫ్రీగానే మాస్క్‌లను పంచుతున్నారు. అయినా కూడా పలు ఆస్పత్రుల్లో, మెడికల్ షాపుల్లో మాస్కుల కొరత..

కరోనా ఎఫెక్ట్: ఇంట్లోనే మాస్క్‌ని తయారు చేసుకోండిలా
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 6:44 PM

ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తోన్న కరోనా వైరస్.. రోజురోజుకూ మరింతగా విజృంభిస్తోంది. చైనాలోని ఊహాన్‌లో మొదలైన ఈ వైరస్.. ప్రపంచ దేశాలకూ విస్తరిస్తోంది. దీనివల్ల ఇప్పుడు భారత్‌లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా.. ఈ వైరస్‌తో అందరూ జాగ్రత్తగా ఉండమని చెబుతూ.. పలు పద్దతులను పాటించమని అధికారులు కూడా సూచిస్తున్నారు.

అందులో ముఖ్యమైనది.. ముఖానికి మాస్క్ ధరించడం. అయితే కరోనా వైరస్ భయంతో అందరూ మాస్క్‌లను కొనుగోలు చేస్తున్నారు. పలు సేవా సంస్థలు కూడా ఫ్రీగానే మాస్క్‌లను పంచుతున్నారు. అయినా కూడా పలు ఆస్పత్రుల్లో, మెడికల్ షాపుల్లో మాస్కుల కొరత ఏర్పడుతూనే ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రజలు ఉంటున్నారు. అయితే తాత్కలికంగా మాస్క్‌ను తయారు చేసుకోవచ్చని… సోషల్ మీడియాలో పలు వీడియోలు ట్రోల్ అవుతున్నాయి.

మరి మాస్క్‌ని ఎలా తయారు చేసుకోవచ్చు: దీనికి పెద్దగా ఏమీ ఆయాశపడనవసరం లేదు. ఇంట్లోని టిష్యూ పేపర్‌తోనే మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. ఒక టిష్యూ, రెండు రబ్బర్ రబ్బర్లు, నాలుగు పిన్నులతో చేసుకోవచ్చు. గత రెండు రోజుల నుంచి ఈ వీడియోలు ట్రెండ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. మాస్కులు దొరకని వారు ఇలా తయారు చేసుకుని.. పెట్టుకుంటున్నారు కూడా. తయారీ విధానాన్ని ఈ క్రింది వీడియోల్లో చూడండి. ఇంకెందుకు ఆలస్యం మీరూ తయారు చేసుకోండి మరి.