AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s T20 World Cup : ఫైన‌ల్లో భార‌త్‌ వ‌ర్సెస్ ఆసీస్.. రీజన్ 100% ఆయనేనట..!

ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్ అనూహ్యంగా ఫైనల్‌లోకి ఎంటర్ అయ్యింది. దీంతో మార్చి 8 ఆదివారం భారత్‌తో ఫైనల్‌లో తలపడనుంది. గురువారం సిడ్నీలో జరిగిన రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాపై ఆసీస్‌ ఉత్కంఠ విజ‌యం సాధించింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో 5 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్.. 5 వికెట్ల […]

Women's T20 World Cup : ఫైన‌ల్లో భార‌త్‌ వ‌ర్సెస్ ఆసీస్.. రీజన్ 100% ఆయనేనట..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 05, 2020 | 7:14 PM

Share

ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్ అనూహ్యంగా ఫైనల్‌లోకి ఎంటర్ అయ్యింది. దీంతో మార్చి 8 ఆదివారం భారత్‌తో ఫైనల్‌లో తలపడనుంది. గురువారం సిడ్నీలో జరిగిన రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాపై ఆసీస్‌ ఉత్కంఠ విజ‌యం సాధించింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో 5 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్.. 5 వికెట్ల నష్టానికి కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది.

మెగ్ లానింగ్ 49 పరుగులు చేయగా.. బెత్ మూనీ 28, అలెసా హీలీ 18 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్ నాద్నీ డికిర్క్ మూడు వికెట్లు పడగొట్టింది. అయితే ఆసీస్‌ బ్యాటింగ్‌ ముగిసిన వెంటనే వరుణుడు ఎంటర్ అవ్వడంతో.. మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత సౌతాఫ్రికా లక్ష్యాన్ని.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం స‌వ‌రించారు. 13 ఓవ‌ర్ల‌లో 98 పరుగులు చేయాలని నిర్ణయించారు. అయితే సవరించిన ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా.. ఆరంభంలోనే తడబడింది. టాపార్డర్‌ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బౌలింగ్‌తో ఆసీస్‌ బౌలర్లు వికెట్లు పడగొడుతూ.. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేశారు. అయితే చివర్లో లారా వోల్వార్డ్ట్ వేగంగా 41 పరుగులు చేసి.. దాదాపు మ్యాచ్‌ను గట్టేక్కించేలా కనిపించింది. అయితే అవతలివైపు నుంచి సరైన సహకారం లేకపోవడంతో.. సఫారీ జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయింది. దీంతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. లారా కన్నీటి పర్యంతం అయింది. మరోవైపు మంచి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆసీస్‌ ఫైనల్‌లో ప్రవేశించింది. ఇప్పటికి నాలుగు సార్లు టీ20 ప్రపంచకప్‌‌ను గెలిచిన ఆసీస్.. ఈసారి కూడా ఎగరేసుకుపోతుందా.. లేక.. భారత్ వశం చేసుకుంటుందా అన్నది ఆదివారం తేలనుంది.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర