క్రికెట్‌లో నెం.4 లొల్లి.. పొలిటికల్ స్లాట్‌తో ‘మకిలి’!

క్రికెట్‌లో నెం.4 లొల్లి.. పొలిటికల్ స్లాట్‌తో 'మకిలి'!

టీమిండియాను ఎంతోకాలంగా వేధిస్తున్న నెంబర్ 4 స్లాట్‌పై మరోసారి చర్చ షురూ అయింది. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని.. దేశవాళీ టోర్నమెంట్లలో వారు అద్భుతంగా రాణిస్తున్నారని మాజీలు కితాబు ఇస్తున్నారు. శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, సంజూ శాంసన్ ఇలా చాలామంది ప్లేయర్స్ జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా శ్రమ పడుతున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా- ఏతో జరిగిన సిరీస్‌లో వీరందరూ చక్కటి ప్రదర్శన కనబరిచారు. ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత జట్టులో నెంబర్ 4 […]

Ravi Kiran

|

Sep 09, 2019 | 11:19 AM

టీమిండియాను ఎంతోకాలంగా వేధిస్తున్న నెంబర్ 4 స్లాట్‌పై మరోసారి చర్చ షురూ అయింది. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని.. దేశవాళీ టోర్నమెంట్లలో వారు అద్భుతంగా రాణిస్తున్నారని మాజీలు కితాబు ఇస్తున్నారు. శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, సంజూ శాంసన్ ఇలా చాలామంది ప్లేయర్స్ జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా శ్రమ పడుతున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా- ఏతో జరిగిన సిరీస్‌లో వీరందరూ చక్కటి ప్రదర్శన కనబరిచారు.

ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత జట్టులో నెంబర్ 4 స్థానాన్ని భర్తీ చేసే క్రికెటర్ ఇప్పటివరకు టీమిండియాకు దొరకలేదు. కొంతకాలం అంబటి రాయుడిని ఆ స్థానంలో ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. మళ్ళీ మొదటికే వచ్చింది. ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్ నాలుగవ స్థానంలో ఆడుతుండగా.. అతడు కూడా ఫామ్‌ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. మొన్నటికి మొన్న శ్రేయాస్ అయ్యర్ నాలుగవ స్థానానికి సరిగ్గా సరిపోతాడని మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేసినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అతన్ని ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కు దించాడు. ఇక నెంబర్ 4లో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ ఎప్పటిలానే భారీ స్కోర్ సాధించలేక.. చెత్త షాట్స్‌తో పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

నెంబర్ 4 వ్యవహారం ఇప్పటిది కాదు.. చాలా ఏళ్లుగా సాగుతోంది. మాజీ ప్లేయర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నా.. యువ క్రికెటర్లు దేశవాళీ టోర్నీలలో సత్తా చాటుతున్నా.. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రికి నచ్చిన ఆటగాళ్లే జట్టులోకి వస్తారని ఇన్‌సైడ్ టాక్. ఈ రాజకీయాల వల్ల ఎంతోమంది ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. కొంతమంది సీనియర్లు అయితే.. మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. సో ఎవరు ఎన్నిసార్లు నెంబర్ 4 స్లాట్‌పై చర్చించినా.. కెప్టెన్, కోచ్ తుది నిర్ణయం తర్వాత ఎవరు ఆడతారు అనేది ఖరారవుతుందని చెప్పవచ్చు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu