వేగంగా కంటైన్మెంట్ జోన్లు.. హైదరాబాద్‌లోనే 190

హైదరాబాద్ నగరంలో కరోనా కంటైన్మెంట్ జోన్లు వేగంగా పెరుగుతున్నాయి. దానికి కారణం కరోనా పాజిటివ్ కేసులు నగరమంతా నమోదవుతుండడమే. రెడ్ జోన్లు (కంటైన్మెంట్ ఏరియాలు) పెరిగిపోతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో...

వేగంగా కంటైన్మెంట్ జోన్లు.. హైదరాబాద్‌లోనే 190

Updated on: Apr 19, 2020 | 7:22 PM

హైదరాబాద్ నగరంలో కరోనా కంటైన్మెంట్ జోన్లు వేగంగా పెరుగుతున్నాయి. దానికి కారణం కరోనా పాజిటివ్ కేసులు నగరమంతా నమోదవుతుండడమే. రెడ్ జోన్లు (కంటైన్మెంట్ ఏరియాలు) పెరిగిపోతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 190 కంటైన్మెంట్ జోన్లను గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ జోన్లలో మరింత పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

కంటైన్మెంట్ జోన్‌లలో పూర్తిగా సీలింగ్ చేస్తున్నామని.. ఒకరకంగా సీలింగ్ లాక్ డౌన్ అమలు చేస్తున్నామని ప్రకటించారు అధికారులు. కంటైన్మెంట్ జోన్ల నుంచి ఎవరు బయటికి రాకుండా.. బయటి నుండి ఎవరు లోపలికి వెళ్లకుండా ఏర్పాటు చేశామని చెబుతున్నారు. ప్రతిరోజు కొత్త కేసులు నమోదు అవుతుండంతో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య చేంజ్ అవుతుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం 190 పైగా కంటైన్మెంట్ జోన్లు హైదరాబాద్‌లో ఉన్నాయని, కనీసం 14 రోజులు కంటైన్మెంట్ జోన్ల నుంచి ప్రజలు ఎవరు బయటికి రాకుండా ఉంటే కరోనా వ్యాప్తిని అరకట్టవచ్చంటున్నారు.

Follow Us