కొత్తవారిని అందలం ఎక్కిస్తే.. ఇలానే ఉంటాది..!

లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అంతర్గత కలహాలు మరింత ముదిరాయి. రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సీనియర్లు గళమెత్తుతున్నారు. రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానానికి, కర్నాటక మాజీ మంత్రి రామలింగరెడ్డి బహిరంగ లేఖ రాయడం సంచలనం రేపింది. సీనియర్లను పక్కనపెట్టి, కొత్తవారికి అందలం ఎక్కించారని ఆయన మండిపడ్డారు. సీనియర్లను పక్కన పెట్టడం వల్లే కర్నాటకలో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. వాస్తవ పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానానికి అవగాహన లేదని విమర్శించారు. మరోవైపు తమ నేతలకు అన్యాయం […]

కొత్తవారిని అందలం ఎక్కిస్తే.. ఇలానే ఉంటాది..!
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2019 | 4:44 PM

లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అంతర్గత కలహాలు మరింత ముదిరాయి. రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సీనియర్లు గళమెత్తుతున్నారు. రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానానికి, కర్నాటక మాజీ మంత్రి రామలింగరెడ్డి బహిరంగ లేఖ రాయడం సంచలనం రేపింది. సీనియర్లను పక్కనపెట్టి, కొత్తవారికి అందలం ఎక్కించారని ఆయన మండిపడ్డారు. సీనియర్లను పక్కన పెట్టడం వల్లే కర్నాటకలో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. వాస్తవ పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానానికి అవగాహన లేదని విమర్శించారు. మరోవైపు తమ నేతలకు అన్యాయం జరిగిందని కర్నాటక కాంగ్రెస్ కార్యాలయం ముందు రామలింగారెడ్డి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Latest Articles