‘జగనన్న చేదోడు’ రూ. 10 వేలు రానివారికి మరో ఛాన్స్..

|

Jun 10, 2020 | 1:19 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా 'జగనన్న చేదోడు' పధకాన్ని ప్రారంభించారు. ఈ పధకం కింద ప్రతీ ఏటా రూ. 10 వేలు చొప్పున మొత్తం 2.47 లక్షల మంది లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 247.04 కోట్లు జమ చేస్తామన్నారు.

జగనన్న చేదోడు రూ. 10 వేలు రానివారికి మరో ఛాన్స్..
Follow us on

కరోనా కాలంలో పేదలకు వరుసగా సంక్షేమ పధకాలను అమలు చేస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా ‘జగనన్న చేదోడు’ పధకాన్ని ప్రారంభించారు. ఈ పధకం కింద ప్రతీ ఏటా రూ. 10 వేలు చొప్పున మొత్తం 2.47 లక్షల మంది లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 247.04 కోట్లు జమ చేస్తామన్నారు. దుకాణాలు కలిగిన రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు జగనన్న చేదోడు పధకం కింద రూ. 10 వేలు ఆర్ధిక సాయం అందనుంది.

ఇదిలా ఉంటే ఈ పధకం కింద అర్దులైనా కూడా రూ. 10 వేలు రానివారి ఎవరైనా ఉంటే.. వారికి మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. వారందరూ కూడా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ వచ్చే నెల రూ. 10 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పధకాలు అందాలని సీఎం స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో రూ. 42, 465 కోట్లతో సంక్షేమ పధకాలను అమలు చేశామని జగన్ వెల్లడించారు.

Also Read: 

జగన్ కీలక నిర్ణయం.. వారందరికీ ఇసుక ఉచితం..

అంతర్రాష్ట్ర సర్వీసులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

విజయవాడలో కరోనా టెర్రర్.. కంటైన్మెంట్ జోన్లుగా 42 డివిజన్లు..

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

ఫోన్‌కే కరోనా ఫలితం.. ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన.!