మా స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారు…

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణలోనే  మెరుగ్గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కరోనా విషయంలో హైకోర్టు ఇప్పటికి 87 పిల్స్‌ను స్వీకరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్  స్పందించారు. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో..

మా స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారు...
Follow us

|

Updated on: Jul 21, 2020 | 11:21 PM

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణలోనే  మెరుగ్గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కరోనా విషయంలో హైకోర్టు ఇప్పటికి 87 పిల్స్‌ను స్వీకరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్  స్పందించారు. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని అన్నారు. దీనివల్ల విధులకు పూర్తిగా న్యాయం చేయలేక పోతున్నామని తెలిపారు.

రాష్ట్రంలోనే మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందని వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాము శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని సీఎంకు వివరించారు. కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ ముర్తజా రిజ్వి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వివిధ వైద్య విభాగాధిపతులు శ్రీనివాస్, రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.