ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ఘనవిజయం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన  ముందుగా ఇంతటి గెలుపును అందించిన నియోజకవర్గ ఓటర్లకు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రతికూల వాతావరణంతో తన సభ జరగకపోయినా ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. ఈ విజయం ప్రభుత్వానికి టానిక్‌లా పనిచేస్తుందన్నారు. త్వరలోనే హుజూర్‌నగర్‌ వెళ్లి కృతజ్ఞత సభ ద్వారా ప్రజలకు ధన్యవాదాలు చెబుతానన్నారు. ఉప ఎన్నిక ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి […]

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 24, 2019 | 8:00 PM

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ఘనవిజయం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన  ముందుగా ఇంతటి గెలుపును అందించిన నియోజకవర్గ ఓటర్లకు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రతికూల వాతావరణంతో తన సభ జరగకపోయినా ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. ఈ విజయం ప్రభుత్వానికి టానిక్‌లా పనిచేస్తుందన్నారు. త్వరలోనే హుజూర్‌నగర్‌ వెళ్లి కృతజ్ఞత సభ ద్వారా ప్రజలకు ధన్యవాదాలు చెబుతానన్నారు. ఉప ఎన్నిక ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో సమ్మెతో ఆర్టీసీ కార్మికులు దురహంకార పద్ధతిని అవలంబించారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలు నాలుగేళ్లలోపు 67 శాతం పెంచామని.. దేశంలో ఎక్కడైనా ఇలా పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. కార్మికులు ఇంకా గొంతెమ్మ కోర్కెలు కోరడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అసంబద్ధమైన, అర్థరహితమైన, తెలివి తక్కువ నినాదం. కార్మికులు చేస్తున్న సమ్మెలో ఔచిత్యం లేదు. ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీయే ముగుస్తుంది” అని కేసీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.

  ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ ‌చేసిన మరిన్ని వ్యాఖ్యలు దిగువ వీడియోలో..

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు