రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ.. గవర్నర్ త‌మిళిసై

ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందర్ రాజన్ కు ధన్వంతరి అవార్డు వచ్చినందుకు సీఎం కేసీఆర్ ఇవాళ నేరుగా రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి ఆయ‌న‌ను సన్మానించి అభినందించారు. ఈ సంద‌ర్భంగా రాజ్‌భ‌వ‌న్‌లో ఈ-ఆఫీసు నిర్వ‌హ‌ణ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు

రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ.. గవర్నర్ త‌మిళిసై

Updated on: Oct 02, 2020 | 5:43 PM

రాజ్‌భ‌వ‌న్‌లో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఈ-ఆఫీస్‌ను ప్రారంభించారు. రాజ్‌భ‌వ‌న్ ప్ర‌జ‌ల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉంటుందన్నారు. గ‌త నాలుగు నెల‌ల నుంచి ఈ-ఆఫీస్ ప‌ద్ద‌తిని అవ‌లంభిస్తున్నామ‌ని వెల్లడించారు.

ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందర్ రాజన్ కు ధన్వంతరి అవార్డు వచ్చినందుకు సీఎం కేసీఆర్ ఇవాళ నేరుగా రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి ఆయ‌న‌ను సన్మానించి అభినందించారు. ఈ సంద‌ర్భంగా రాజ్‌భ‌వ‌న్‌లో ఈ-ఆఫీసు నిర్వ‌హ‌ణ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం కేసీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. రాష్ర్ట ప్ర‌భుత్వం కూడా స‌చివాల‌యంలో ఈ-ఆఫీస్ విధానం అమ‌లు చేస్తున్నందుకు ఆమె అభినంద‌న‌లు తెలిపారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈ-ఆఫీసే మేల‌ని గ‌వ‌ర్న‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉండ‌టం గ‌ర్వంగా ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ తమిళిసై అన్నారు.

ఈ సంద‌ర్భంగా రాష్ర్ట ప్ర‌భుత్వ పాల‌న‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌శంసించారు. తెలంగాణ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంద‌న్నారు. కొవిడ్ నివార‌ణ విష‌యంలో ఇత‌ర రాష్‌ర్టాల కంటే తెలంగాణ ఎంతో మెరుగ్గా ప‌ని చేస్తుంద‌ని గ‌వ‌ర్న‌ర్  ప్రశంసించారు. తెలంగాణ‌లో క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేట్ అధికంగా ఉందని అన్నారు.