AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌, నంద్యాలలో ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్తగారు మాబున్నీసాతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్
Sanjay Kasula
|

Updated on: Nov 20, 2020 | 4:56 PM

Share

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌, నంద్యాలలో ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్తగారు మాబున్నీసాతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కొడుకు, శంషావలి, కూతురు సాజీదాలను తిరుగు ప్రయాణంలో ఏపీఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద పరామర్శించారు ముఖ్యమంత్రి.

సలాం అత్త మాబున్నీసా కు ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన 25 లక్షల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ద్వారా అందించి, తమ కుటుంబానికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపిన సలాం అత్త మాబున్నీసా. తన కూతురు సాజీదా కు ఉద్యోగం ఇవ్వాలని, వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న తన అల్లుడిని అనంతపురం నుండి నంద్యాలకు బదిలీ చేయాలని, దోషులను శిక్షించాలని ముఖ్యమంత్రిని సలాం అత్త మాబున్నీసా కోరారు.

సలాం కుటుంబం ఆత్మహత్య కు కారకులైన దోషులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి అండగా ఉంటామని సలాం అత్త మాబున్నీసాకు ధైర్యం చెప్పి సీఎం జగన్ హామీ ఇచ్చారు.

సీఎం ఆదేశాల మేరకు సలామ్ అత్త కొడుకు శంషావలి ని అనంతపురం డిఎంహెచ్ఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ నుండి నంద్యాల వైద్య ఆరోగ్య శాఖ కు క్షణాలపై డెప్యూటేషన్ ఆర్డర్స్ ఇప్పించారు జిల్లా కలెక్టర్ వీరపాండియన్.

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..