అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ అయ్యారు. విభజన సమస్యల పరిష్కారం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై నేతలు చర్చించారు. సుమారు 40 నిమిషాల పాటు అమిత్‌షాతో సీఎం సమావేశం కొనసాగింది. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సీఎం జగన్‌.. అనంతరం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితో కలిసి హోం మంత్రి అమిత్‌ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌, […]

అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ
Follow us

|

Updated on: Aug 26, 2019 | 8:58 PM

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ అయ్యారు. విభజన సమస్యల పరిష్కారం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై నేతలు చర్చించారు. సుమారు 40 నిమిషాల పాటు అమిత్‌షాతో సీఎం సమావేశం కొనసాగింది. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సీఎం జగన్‌.. అనంతరం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితో కలిసి హోం మంత్రి అమిత్‌ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏ అంశాల్లో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది.

అమిత్‌ షాతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం, పోలవరంతో పాటు పలు నీటి పారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.