కన్‌ఫ్యూజ‌న్‌లో బన్నీ ఫ్యాన్స్, విక్రమ్ కూడా కాదంటున్నారు..మరి ‘పుష్ప’ను ఢీ కొట్టే విలన్ ఎవరు..?

|

Nov 30, 2020 | 1:11 PM

 ఇప్పుడు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ పెద్ద కన్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నారు. బన్నీని ఢీ కొట్టే సమర్థవంతమైన విలన్ కోసం వెతుకులాట జరుగుతోంది. ‌విజయ్ సేతుపతి ఇప్పటికే హ్యాండ్ ఇచ్చాడు.

కన్‌ఫ్యూజ‌న్‌లో బన్నీ ఫ్యాన్స్, విక్రమ్ కూడా కాదంటున్నారు..మరి పుష్పను ఢీ కొట్టే విలన్  ఎవరు..?
Follow us on

ఇప్పుడు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ పెద్ద కన్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నారు. బన్నీని ఢీ కొట్టే సమర్థవంతమైన విలన్ కోసం వెతుకులాట జరుగుతోంది. ‌విజయ్ సేతుపతి ఇప్పటికే హ్యాండ్ ఇచ్చాడు.. బాబీ సింహా కూడా నో అన్నారు.. ఇప్పుడు విక్రమ్ కూడా కాదంటున్నారు… మరి ఇంకెవరు. బన్నీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని పుష్పను చూసి ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్.. ఆ మూవీ అప్‌డేట్స్‌తో తెగ టెన్షన్‌ పడుతున్నారు.

షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే విజయ్‌ సేతుపతిని విలన్‌గా ఫిక్స్‌ చేసింది పుష్ప టీం. కానీ లాక్ డౌన్ తరువాత సీన్ మారిపోయింది. డేట్స్ అడ్జస్ట్ కావట్లేదని పుష్పకు హ్యాండిచ్చారు విజయ్ సేతుపతి. తరువాత బాబీ సింహా పేరు తెరమీదకు వచ్చింది. కానీ ఎలాంటి అప్‌డేట్‌ లేకుండానే ఈ విలన్‌ని కూడా పక్కన పెట్టేశారు. రీసెంట్‌గా కోలీవుడ్ స్టార్ విక్రమ్‌తో బన్నీ ఢీ అంటూ ఓ బిగ్‌ న్యూస్‌ తెగ వైరల్‌ అయ్యింది. కానీ ఇప్పుడు ఆ న్యూస్‌ కూడా ఫేక్‌ అని తేలిపోయింది. విక్రమ్‌ కూడా చేయట్లేదన్న వార్తలతో బన్నీ ఫ్యాన్స్‌ టెన్షన్ పడుతున్నారు. త్వరగా విలన్‌ పేరు ఫైనల్‌ చేయమంటూ సుకుమార్‌కు సోషల్ మీడియాలో రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.

Also Read :

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు