“చిరునవ్వుతో” ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టి 20 ఏళ్లు !

సరిగ్గా 20 ఏళ్ల క్రితం చిన్న సినిమాగా విడుదలై చాలా పెద్ద విజయం సాధించిన చిత్రం 'చిరునవ్వుతో'. తొలిచిత్రం 'స్వయంవరం'తో నిర్మాతగా ఘన విజయం అందుకున్న శ్యామ్ ప్రసాద్.

చిరునవ్వుతో  ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టి 20 ఏళ్లు !
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 10, 2020 | 7:29 PM

సరిగ్గా 20 ఏళ్ల క్రితం చిన్న సినిమాగా విడుదలై చాలా పెద్ద విజయం సాధించిన చిత్రం ‘చిరునవ్వుతో’. తొలిచిత్రం ‘స్వయంవరం’తో నిర్మాతగా ఘన విజయం అందుకున్న శ్యామ్ ప్రసాద్.. జి.రామ్ ప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ…వేణు తొట్టెంపూడి-షహీన్ ఖాన్ జంటగా.. ప్రేమ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 10, 2000లో విడుదలై సంచలన విజయం సాధించింది. రెండు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించి… నాలుగింతల లాభం ఆర్జించి పెట్టింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ-మాటలు ‘చిరునవ్వుతో” సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి. నిజానికి నేటి స్టార్ కమెడియన్ సునీల్ ఈ చిత్రంతోనే నటుడిగా పరిచయమయ్యారు. కాకపోతే… తను నటించిన ‘నువ్వేకావాలి’ ముందు విడుదలైంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, గిరిబాబు, చంద్రమోహన్, సుధ, ఎం.ఎస్.నారాయణ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి రివార్డులతోపాటు.. అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏకంగా నాలుగు నందులు గెలుచుకుంది.

బెస్ట్ డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్, బెస్ట్ ప్రొడ్యూసర్ గా శ్యామ్ ప్రసాద్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా జి.రామ్ ప్రసాద్ కు అవార్డులు తెచ్చిపెట్టిడంతో పాటు.. బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా కైవసం చేసుకుంది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మకు ఫిల్మ్ ఫేర్ పురస్కారం దక్కింది. హైద్రాబాద్ సుదర్శన్ లో ఏకంగా 175 రోజులు ప్రదర్శించబడి చరిత్ర సృష్టించిన ‘చిరునవ్వుతో’… హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేయబడడం విశేషం.

తమిళంలో హీరో విజయ్ నటించగా… ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు. కన్నడలో రవిచంద్రన్ హీరోగా అశ్వినీదత్ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఈ రెండు రీమేక్స్ లోనూ షాహీన్ హీరోయిన్ కావడం గమనార్హం. “చిరునవ్వుతో” తన కెరీర్ కి సుస్థిరమైన పునాది వేసుకున్న జి.రామ్ ప్రసాద్.. ఆ తరువాత.. “కళ్యాణరాముడు, ఖుషీ ఖుషీగా, సీమసింహం, నా స్టయిలే వేరు” వంటి పలు చిత్రాలు తెరకెక్కించి ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయారు. హీరో వేణు తొట్టెంపూడి కెరీర్ లో ఈ చిత్రం ఓ కలికితురాయిగా నిలిచిపోయింది.

Also Read :

తెలంగాణ : పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే