AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిక్ ​టాక్​, వుయ్ ​చాట్​లపై అమెరికా నిషేధం

ట్రంప్​ అన్నంతపనీ చేశారు. అమెరికాలో టిక్ ​టాక్​, వుయ్ ​చాట్​లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ట్రంప్ సర్కార్ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.

టిక్ ​టాక్​, వుయ్ ​చాట్​లపై  అమెరికా నిషేధం
Balaraju Goud
|

Updated on: Sep 18, 2020 | 7:25 PM

Share

ట్రంప్​ అన్నంతపనీ చేశారు. అమెరికాలో టిక్ ​టాక్​, వుయ్ ​చాట్​లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ట్రంప్ సర్కార్ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆదివారం సెప్టెంబర్ 20 నుంచి ఇకపై అమెరికాలో ఈ యాప్​ లు డౌన్ ​లోడ్​ చేసుకొనేందుకు వీలులేదంటూ యూఎస్ డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్ తెలిపింది. చైనాకు చెందిన టెన్సెంట్ తో సహా బైట్ డాన్స్ కంపెనీలకు చెందిన ఈ రెండు యాప్ లు iOS యాప్ స్టోర్ తో పాటు గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించాలని అమెరికా తెలిపింది. ఆ రెండు కంపెనీలు యుఎస్ లో హోస్ట్ చేయకుండా నిషేధం విధిస్తున్న అమెరికా సర్కార్ పేర్కొంది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నామని అమెరికా వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ తెలిపారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ… అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థను బెదిరించడానికి ఈ యాప్ లను ఉపయోగించుకునే మార్గాలను ఆయన తెలిపారు.

గతంలోనే తమ దేశ టిక్‌ టాక్‌ వినియోగదారుల సమాచారం చైనాకు చేరుతుందంటూ.. సమాచార భద్రతపై గతంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో యాప్.. యూఎస్‌ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించేలా ట్రంప్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపినా.. బైట్‌ డ్యాన్స్‌ అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత ఒరాకిల్​- బైట్​డాన్స్​ల మధ్య ఒప్పందం కోసం చర్చలు జరిగినా.. పొత్తు కుదరలేదని తెలుస్తోంది. టిక్‌టాక్‌కు అమెరికాలో 8 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉండగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Follow Us
అప్పట్లో ప్రేమికులకు ఈ పాట చాలా స్పెషల్.. ఇప్పటికీ యూట్యూబ్‏‏లో
అప్పట్లో ప్రేమికులకు ఈ పాట చాలా స్పెషల్.. ఇప్పటికీ యూట్యూబ్‏‏లో
వర్షాకాలంలో బట్టలు బ్యాడ్ స్మెల్ వస్తున్నాయా? అద్భుతమైన చిట్కాలు
వర్షాకాలంలో బట్టలు బ్యాడ్ స్మెల్ వస్తున్నాయా? అద్భుతమైన చిట్కాలు
తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా
తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా
ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉండనుందంటే..
ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉండనుందంటే..
మధ్యాహ్న భోజనంలో చపాతీ vs అన్నం - ఏది ఆరోగ్యకరమైనది?
మధ్యాహ్న భోజనంలో చపాతీ vs అన్నం - ఏది ఆరోగ్యకరమైనది?
టాస్‌లో కరచాలనం చేయని భారత్, పాక్ కెప్టెన్లు..!
టాస్‌లో కరచాలనం చేయని భారత్, పాక్ కెప్టెన్లు..!
సింహరాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని సంపద, పదోన్నతి..
సింహరాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని సంపద, పదోన్నతి..
ఈ 6 గింజలు తింటే చాలు.. జుట్టు, చర్మం, సంతానోత్పత్తి అద్భుత వరం!
ఈ 6 గింజలు తింటే చాలు.. జుట్టు, చర్మం, సంతానోత్పత్తి అద్భుత వరం!
దాసరి, చిరంజీవి మధ్యలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా.. ?
దాసరి, చిరంజీవి మధ్యలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా.. ?
నీతా అంబానీ చీర తయారీకి 3 నెలల సమయం.. చీర ప్రత్యేకత ఇదే!
నీతా అంబానీ చీర తయారీకి 3 నెలల సమయం.. చీర ప్రత్యేకత ఇదే!