గీతం విద్యా సంస్థ లాభార్జన కోసం ఏర్పాటు చేసింది కాదు : చినరాజప్ప

విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంపై జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప విమర్శించారు. తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి వికృత చేష్టలకు, వింతపోకడలకు పోతున్నారని ఆరోపించారు. అధికారులంతా దసర సెలవుల్లో ఉండగా కనీసం నోటీసు ఇవ్వకుండా కూల్చివేతకు తెగబడటం ప్రభుత్వ కుట్రకు అద్దంపడుతుందని రాజప్ప అన్నారు. “అర్ధరాత్రి వేళ 200 మందితో వచ్చి కూల్చాల్సిన అవసరం ఏంటి? ఇది జగన్ రెడ్డి నియంతృత్వ పాలనకు నిదర్శనం”. అని […]

గీతం విద్యా సంస్థ లాభార్జన కోసం ఏర్పాటు చేసింది కాదు : చినరాజప్ప
Follow us

|

Updated on: Oct 24, 2020 | 3:51 PM

విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంపై జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప విమర్శించారు. తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి వికృత చేష్టలకు, వింతపోకడలకు పోతున్నారని ఆరోపించారు. అధికారులంతా దసర సెలవుల్లో ఉండగా కనీసం నోటీసు ఇవ్వకుండా కూల్చివేతకు తెగబడటం ప్రభుత్వ కుట్రకు అద్దంపడుతుందని రాజప్ప అన్నారు. “అర్ధరాత్రి వేళ 200 మందితో వచ్చి కూల్చాల్సిన అవసరం ఏంటి? ఇది జగన్ రెడ్డి నియంతృత్వ పాలనకు నిదర్శనం”. అని ఆయన ఆరోపించారు. “గీతం విద్యా సంస్థ లాభార్జన కోసం ఏర్పాటు చేసింది కాదు.. అత్యున్నత నాణ్యమైన, విద్యను అందించేందుకు ఏర్పాటైన చదువుల నిలయం.. అటువంటి సంస్థలపై తప్పుడు ఆరోపణలు చేసి.. వాటి ఖ్యాతిపై బురద జల్లడాన్ని ఖండిస్తున్నాం.” అని రాజప్ప చెప్పుకొచ్చారు.