AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా సెకెండ్ వేవ్.. 60కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను తయారు చేసుకుంటున్న చైనా

కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. థర్డ్ వేవ్ కూడా ఉండనుంది. దీంతో ఇప్పటికే కొన్ని దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారు. అయితే కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో చైనా కాస్త ముందుంది. ఎక్కువగా డోసులు తయారీ చేస్తూ ఆ దేశం దూసుకెళ్తోంది.

కరోనా సెకెండ్ వేవ్.. 60కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను తయారు చేసుకుంటున్న చైనా
Anil kumar poka
|

Updated on: Dec 08, 2020 | 9:11 AM

Share

China prepares COVID-19 vaccines: కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. థర్డ్ వేవ్ కూడా ఉండనుంది. దీంతో ఇప్పటికే కొన్ని దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారు. అయితే కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో చైనా కాస్త ముందుంది. ఎక్కువగా డోసులు తయారీ చేస్తూ ఆ దేశం దూసుకెళ్తోంది. 2021 చివరి నాటికి దాదాపు 60కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను తయారు చేసేందుకు సిద్దమవుతోంది. చైనాలో ఇప్పటికే ఐదు వ్యాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటికి సంబంధించిన తుదిదశ ప్రయోగాలు దాదాపు పన్నెండు దేశాల్లో జరుగుతున్నాయి.

సినోవాక్‌ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ తుదిదశ ప్రయోగాలు బ్రెజిల్‌, టర్కీ, ఇండోనేషియాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ ను చైనా ఆరోగ్య సిబ్బందికి, సైనిక అధికారులకు అందజేశాశారు. చైనాలో ఈ వ్యాక్సిన్ ను భారీగా పంపిణీ చేస్తున్నారు. కానీ దీనికి అధికారిక అనుమతులు లేవు. సినోవాక్ తయారు చేసిన వ్యాక్సిన్‌ రెండు డోసుల్లో తీసుకోవాలి. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల వద్దే నిల్వ చేయాలి.

ఇక ప్రపంచానికి మొత్తం తమ వ్యాక్సిన్ సరఫరా చేయాలని చూస్తోందట చైనా. కోవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి ప్రపంచానికి తోడ్పడతామంటోంది. అంతేకాదు కరోనా నేపథ్యంలో పేద దేశాలకు చైనా నిధులిచ్చేందుకు వీలుగా నిబంధనలను సవరిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు