చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కస్టడీ పూర్తి

సంచలనం సృష్టించిన 11 వందల కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్‌లో నిందితుల‌ కస్టడీ పూర్త‌య్యింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల 4 రోజుల విచారణలో నిందితులు నోరు విప్పలేద‌ని స‌మాచారం.

చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కస్టడీ పూర్తి
Follow us

|

Updated on: Aug 28, 2020 | 3:06 PM

సంచలనం సృష్టించిన 11 వందల కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్‌లో నిందితుల‌ కస్టడీ పూర్త‌య్యింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల 4 రోజుల విచారణలో నిందితులు నోరు విప్పలేద‌ని స‌మాచారం. చైనాకి చెందిన ప్రధాన సూత్రదారులే అంతా చేశార‌ని నిందితులు చెప్పిన‌ట్లు పోలీసు వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

చైనాకి చెందిన నింగ్ యాంగ్, డింగ్ యాంగ్, లింగ్ లింగ్ యాంగ్, యాన్ హౌ అనే వ్య‌క్తులు ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రదారులని పోలీసుల విచారణ‌లో నిందితులు వెల్లడించారు. ఇంకో కేసులో మరోసారి ఈ నిందితుల‌ను పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం క‌నిపిస్తోంది. చైనాకి చెందిన ప్రధాన నిందితులను అరెస్ట్ చేస్తేనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు పోలీసులు. కాగా ఆన్‌లైన్ గేమింగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రూ 1,100 కోట్లు వినియోగించిన‌ట్లు పోలీసులు తెలిపారు. రూ.30 కోట్ల మేర బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశామ‌ని చెప్పారు.

Also Read :

బెజ‌వాడ‌లో ఇద్ద‌రు రౌడీ షీట‌ర్లు అరెస్ట్, మార‌ణాయుధాలు స్వాధీనం

“సంక్షేమాన్ని అడ్డుకోవ‌డ‌మే బాబు పని”