AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైటరే కాదు చీటర్ కూడా..

హైదరాబాద్‌ : ప్రేమించి సహజీవనం చేసి పెళ్ళి చేసుకొని రాత్రికి రాత్రే ఉడాయించిన సినీ రచయితపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే… విశాఖకు చెందిన యర్రంశెట్టి రమణ గౌతం కూకట్‌పల్లిలో అద్దెకుంటూ బుల్లితెర, వెండితెరకు సినీ రచయితగా పని చేస్తున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన భవానీ అనే యువతితో నాలుగేళ్ళ క్రితం ప్రేమలో పడ్డాడు. ఆమె సంపాదించినదంతా దండుకుంటూ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి సహ జీవనం చేశాడు. పెళ్ళి […]

రైటరే కాదు చీటర్ కూడా..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 02, 2019 | 9:00 AM

Share

హైదరాబాద్‌ : ప్రేమించి సహజీవనం చేసి పెళ్ళి చేసుకొని రాత్రికి రాత్రే ఉడాయించిన సినీ రచయితపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే… విశాఖకు చెందిన యర్రంశెట్టి రమణ గౌతం కూకట్‌పల్లిలో అద్దెకుంటూ బుల్లితెర, వెండితెరకు సినీ రచయితగా పని చేస్తున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన భవానీ అనే యువతితో నాలుగేళ్ళ క్రితం ప్రేమలో పడ్డాడు. ఆమె సంపాదించినదంతా దండుకుంటూ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి సహ జీవనం చేశాడు.

పెళ్ళి చేసుకోవాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఇవాళ రేపు అంటూ తప్పించుకోసాగాడు. ఆమె తనను పెళ్ళి చేసుకుంటానని మోసగిస్తున్న రమణగౌతంపై చర్యలు తీసుకోవాలంటూ నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమణగౌతంను బంజారాహిల్స్‌ పోలీసులు పిలిపించి పెళ్ళి చేసుకోవాలంటూ సూచించడంతో అదే రోజు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఓ గుడిలో పెళ్ళి చేసుకొని అదే రాత్రి ఉడాయించాడు. శుక్రవారం ఉదయం ఆమెకు ఫోన్‌ చేసి నువ్వంటే ఇష్టంలేదు, విడాకులు తీసుకుందామంటూ వెల్లడించాడు. దీంతో ఆమె షాక్‌ తింది. శనివారం మోసగాడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ బచ్చు శ్రీనివాస్‌ నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది
గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది
సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. విద్యార్థి ఫోన్ కాల్
సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. విద్యార్థి ఫోన్ కాల్
ఈ నీరు ఒక్క గ్లాసు తాగితే ఎలాంటి అనారోగ్యమైనా ఖతం అట..
ఈ నీరు ఒక్క గ్లాసు తాగితే ఎలాంటి అనారోగ్యమైనా ఖతం అట..
ఫోన్‌లలో ఆధార్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం
ఫోన్‌లలో ఆధార్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం
ఆనంద్ మూవీలో పేస్ట్ తినే పాప గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఆనంద్ మూవీలో పేస్ట్ తినే పాప గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. దిగజారిన వెండి!
ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. దిగజారిన వెండి!
ఆర్‌ఎంపీ డాక్డర్‌ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌..
ఆర్‌ఎంపీ డాక్డర్‌ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌..
ఆఫీసుకు వెళ్లాలనే టెన్షనే వద్దు.. నిమిషాల్లో చేసుకునే టిఫిన్స్
ఆఫీసుకు వెళ్లాలనే టెన్షనే వద్దు.. నిమిషాల్లో చేసుకునే టిఫిన్స్
భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని..
భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని..
బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. మరో 3 రోజుల్లోనే వేసవి సెలవులు
బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. మరో 3 రోజుల్లోనే వేసవి సెలవులు