Paapam Prathap : తిరువీర్ పాపం ప్రతాప్ సినిమా హిట్టా..? ఫట్టా..?
తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పక్కా గ్రామీణ చిత్రం పాపం ప్రతాప్. 1990ల నాటి గోదావరి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా లేదా..? అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం ..!
పాపం ప్రతాప్ కథ విషయానికి వస్తే.. 1990ల కాలం నాటి గోదావరి జిల్లా గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రతాప్ అలియాస్ తిరువీర్ తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ అలియాస్ పాయల్ రాధాకృష్ణను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అంతా సంతోషంగా ఉందనుకునేలోపు, పెళ్లయిన మూడు రోజులకే జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల ఊరి పంచాయితీలో ప్రతాప్‌కు ఘోర అవమానం జరుగుతుంది. ఆ దెబ్బతో బుజ్జమ్మ ప్రతాప్‌ను వదిలి వెళ్లిపోతుంది. భార్య దూరమవడంతో ఊరి జనమంతా.. ప్రతాప్‌ను చూసి ‘పాపం ప్రతాప్’ అంటూ జాలి పడుతూనే వెటకారం చేస్తూ ఉంటారు. దీనికి తోడు ప్రతాప్‌కు నిద్రలో ఓ వింత సమస్య కూడా ఉంటుంది. పగలు ఒకలాగా.. పడుకుంటే మరో లాగా మారిపోతుంటాడు ప్రతాప్. ఊరి వాళ్ల హేళనను తట్టుకుని, ప్రతాప్ తన భార్యను మళ్లీ ఎలా దక్కించుకున్నాడు, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుని పాపం ప్రతాప్ కాస్తా వీర ప్రతాప్‌గా ఎలా ఎదిగాడు అనేది మిగతా కథ..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!
