AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar : స్మార్ట్‌ఫోన్‌ల్లో ఆధార్ యాప్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఎందుకంటే

ప్రజలకు సౌకర్యవంతమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంలో స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయాలనే ప్రతిపాదనను ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొబైల్ కంపెనీలతో జరిగిన చర్చలు తర్వాత, భారత ఐటీ మంత్రిత్వ శాఖ ఈ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొంది.

Aadhaar : స్మార్ట్‌ఫోన్‌ల్లో ఆధార్ యాప్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఎందుకంటే
Govt Withdraws Aadhaar App Pre Install On Phones
Anand T
|

Updated on: Apr 19, 2026 | 11:21 AM

Share

దేశ ప్రజలకు మరింత సులభమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఆధార్ గుర్తింపు కార్డుల తయారీ సంస్థ UIDAI దేశంలో విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో ఫోన్‌లలో ఇన్‌బుల్‌టుగా ఆధార్ యాప్ ఉండేలా చూడాలని ఐటీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించింది. దీని ద్వారా బ్యాంకింగ్, టెలికాం వెరిఫికేషన్ వంటి సేవలు ప్రజలకు సులభతరం అవుతాయని UIDAI భావించింది.

అయితే తాజాగా ఈ అంశంపై జరిగిన చర్చల్లో యాపిల్, శామ్‌సంగ్ , గూగుల్ వంటి ప్రముఖ సంస్థలుతో UIDAI నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ముఖ్యంగా యూజర్ ప్రైవసీ, డివైజ్ సెక్యూరిటీ, భద్రతాపరమైన ముప్పుల గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

అయితే ప్రభుత్వం ఇలా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఇదే మొదటి సారేం కాదు. గత రెండేళ్లలో ఇలాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఇది ఆరోసారి. గత డిసెంబర్‌లో ‘సంచార్ సాథీ’ అనే టెలికాం యాప్‌ను కూడా తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావించింది, కానీ తీవ్ర నిరసనల తర్వాత ఆ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకుంది. మొబైల్ కంపెనీలు ప్రతిసారీ భద్రత, ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫోన్‌లలో ఆధార్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం
ఫోన్‌లలో ఆధార్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం
ఆనంద్ మూవీలో పేస్ట్ తినే పాప గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఆనంద్ మూవీలో పేస్ట్ తినే పాప గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. దిగజారిన వెండి!
ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. దిగజారిన వెండి!
ఆర్‌ఎంపీ డాక్డర్‌ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌..
ఆర్‌ఎంపీ డాక్డర్‌ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌..
ఆఫీసుకు వెళ్లాలనే టెన్షనే వద్దు.. నిమిషాల్లో చేసుకునే టిఫిన్స్
ఆఫీసుకు వెళ్లాలనే టెన్షనే వద్దు.. నిమిషాల్లో చేసుకునే టిఫిన్స్
భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని..
భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని..
బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. మరో 3 రోజుల్లోనే వేసవి సెలవులు
బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. మరో 3 రోజుల్లోనే వేసవి సెలవులు
ఈ ఫొటోలో ఒక స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ ఫొటోలో ఒక స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో గుర్తు పట్టారా?
ఎక్స్‌క్లూజివ్ కంటెంట్.. అనన్య కూడా మొదలెట్టిందిగా..!
ఎక్స్‌క్లూజివ్ కంటెంట్.. అనన్య కూడా మొదలెట్టిందిగా..!
స్టెప్పులతో ఇరదీసిన ప్రిన్సిపాల్.. జోష్‌లో స్టూడెంట్స్..!
స్టెప్పులతో ఇరదీసిన ప్రిన్సిపాల్.. జోష్‌లో స్టూడెంట్స్..!