చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా..?
ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. జూలై 15న దీన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్ సైంటిస్టులు గత 15 రోజులుగా షార్‌లో ఆర్బిటర్, రోవర్, ల్యాండర్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. గురువారం వ్యాబ్‌లో జీఎస్ఎల్వీ మార్క్ 3 వాహక నౌకలో వీటిని అమర్చారు. శనివారం దీనికి తుది పరీక్షలు నిర్వహించి ల్యాండర్, ఆర్బిటర్, రోవర్‌ల పనితీరును క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఆదివారం ఈ వాహకనౌకను రెండో ప్రయోగ వేదికకు తీసుకొచ్చి […]

ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. జూలై 15న దీన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్ సైంటిస్టులు గత 15 రోజులుగా షార్‌లో ఆర్బిటర్, రోవర్, ల్యాండర్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. గురువారం వ్యాబ్‌లో జీఎస్ఎల్వీ మార్క్ 3 వాహక నౌకలో వీటిని అమర్చారు. శనివారం దీనికి తుది పరీక్షలు నిర్వహించి ల్యాండర్, ఆర్బిటర్, రోవర్‌ల పనితీరును క్షుణ్ణంగా తెలుసుకున్నారు.
ఆదివారం ఈ వాహకనౌకను రెండో ప్రయోగ వేదికకు తీసుకొచ్చి పూర్తి స్ధాయిలో అనుసంధానం చేసి గ్లోబుల్ చెక్స్, ఫేజ్-3 , లెవెల్ 1,2 చెకింగ్స్ చేస్తారు. రెండో ప్రయోగవేదికపైనే వారం రోజులపాటు పలు రకాల పరీక్షలు నిర్వహించి జూలై 15 తెల్లవారుజామున 2. 51 గంటలకు చంద్రయాన్ -2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.
ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి చంద్రయన్ -2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగాచూసే వీలుకల్పించింది ఇస్రో. దీనికోసం ఆన్‌లైన్‌లో ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వివరాలను www.isro.gov.in ద్వారా నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుది. దాదాపు 10 వేలమందికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.



