AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో ‘ వైస్రాయ్ ‘ సీన్ రిపీట్ ! ఛలో ‘ ముంబై హోటల్ ‘!

కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీ-ఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కష్టాల్లో పడింది. 8 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు జేడీ-ఎస్ ఎమ్మెల్యేలు..మొత్తం 11 మంది రాజీనామాలు చేయడంతో పెను గండాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కుమారస్వామి అమెరికాలో ప్రయివేటు పర్యటనలో ఉండడంతో రాష్ట్రాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ 11 మంది సభ్యులూ తమ రాజీనామాలను శనివారం మధ్యాహ్నం స్పీకర్ కు సమర్పించారు. అనంతరం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలుసుకున్నారు. ఆ తరువాత […]

కర్ణాటకలో ' వైస్రాయ్ ' సీన్ రిపీట్ ! ఛలో ' ముంబై హోటల్ '!
Pardhasaradhi Peri
|

Updated on: Jul 07, 2019 | 11:08 AM

Share

కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీ-ఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కష్టాల్లో పడింది. 8 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు జేడీ-ఎస్ ఎమ్మెల్యేలు..మొత్తం 11 మంది రాజీనామాలు చేయడంతో పెను గండాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కుమారస్వామి అమెరికాలో ప్రయివేటు పర్యటనలో ఉండడంతో రాష్ట్రాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ 11 మంది సభ్యులూ తమ రాజీనామాలను శనివారం మధ్యాహ్నం స్పీకర్ కు సమర్పించారు. అనంతరం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలుసుకున్నారు. ఆ తరువాత ప్రయివేటు జెట్ విమానంలో ముంబై చేరుకొని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించిన పక్షంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాల్సిదిగా కోరామని జేడీ-ఎస్ ఎమ్మెల్యేహెచ్. విశ్వనాథ్ తెలిపారు. రెండు రోజుల క్రితమే ఈయన తమ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. మరో కాంగ్రెస్ సభ్యుడు రామలింగారెడ్డి..తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అసంతృప్తితో రాజీనామా చేసినట్టు తెలిపారు. అయితే ఆరాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్.. డి.కె. శివకుమార్.. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో భేటీ అయి కొద్దిసేపు సమాలోచనలు జరిపారు. వారి రాజీనామాలను తాను చించివేసినట్టు ఆయన చెప్పారు. అయితే ఇదంతా బహుశా ‘ డ్రామా ‘ అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఢిల్లీలో శనివారం సాయంత్రం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు.. ప్రధాని మోదీ, ఆయనతో బాటు బీజేపీ..పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపించారు. ‘ ఆయారాం-గయారాం ‘ అన్న నినాదానికి ఇప్పుడు కొత్త నిర్వచనం చెప్పుకోవలసివస్తుందని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్, జనతాదళ్-ఎస్ సభ్యులు మొత్తం 116 మంది ఉన్నారు. (మెజారిటీ ఫిగర్ 113 ఉంటే సరిపోతుంది). 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, అవి ఆమోదానికి నోచుకున్న పక్షంలో.. కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. గత ఏడాది మే నెలలో ఏర్పడిన ప్రభుత్వం మొదటినుంచే దినదిన గండంలా నెట్టుకొస్తోంది. సంకెర్ణంలో తిరుగుబాట్లు సహజమయ్యాయి. సీఎం కుమారస్వామి సాక్షాత్తూ మీడియా సమావేశంలోనే ఒకటిరెండుసార్లు కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే. ఆయన అమెరికా నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చాక ఈ సంక్షోభాన్ని ఎలా నివారిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us
మటన్ బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను.. అసలేం జరిగిందంటే..
మటన్ బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను.. అసలేం జరిగిందంటే..
ఏపీలో DSC 2026 నోటిఫికేషన్ విడుదల.. మొత్తం టీచర్ పోస్టులు ఇవే!
ఏపీలో DSC 2026 నోటిఫికేషన్ విడుదల.. మొత్తం టీచర్ పోస్టులు ఇవే!
ఏపీలో వారికి శుభవార్త.. అకౌంట్లోకి రూ.30 వేలు.. రెడీగా ఉండండి..
ఏపీలో వారికి శుభవార్త.. అకౌంట్లోకి రూ.30 వేలు.. రెడీగా ఉండండి..
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్
సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్