ఫ్యామిలీతో విదేశీ టూర్‌కు చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నఆయన జూన్ 4న విజయవాడకు రానున్నారు. అక్కడ మూడు రోజుల పాటు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి జూన్ ఆరో తేదిన విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడ ఉండనున్న బాబు.. తరువాత రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. కాగా ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం 23 సీట్లతో టీడీపీ […]

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నఆయన జూన్ 4న విజయవాడకు రానున్నారు. అక్కడ మూడు రోజుల పాటు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి జూన్ ఆరో తేదిన విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడ ఉండనున్న బాబు.. తరువాత రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. కాగా ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం 23 సీట్లతో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.